గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (10:59 IST)

ఆఫీసులో అదేపనిగా స్నాక్స్ తింటున్నారా..?

ఉద్యోగం చేసే మహిళలు వర్క్ ప్లేసులో రకరకాల స్నాక్స్ తింటుంటారు. దాని ఫలితంగా వారిలో క్యాలరీలు బాగా పెరుగుతాయి. వర్క్ ప్లేసులో మహిళలు తింటున్న స్నాక్స్ వలన సంవత్సరానికి లక్ష క్యాలరీలు పెరుగుతున్నారని కూడా ఒక సర్వేలో వెల్లడైంది. అందుకే వర్కింగ్ విమెన్ ఎలాంటి స్నాక్స్‌కు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
 
ఆఫీసులో పనిచేసేటప్పుడు మధ్య మధ్యలో చాలామంది ఆడవాళ్లు బిస్కట్లు తింటుంటారు. ఇవి ఒకటి రెండి అయితే ఫరవాలేదు కానీ దానికి మించి తింటే శరీరానికి మంచిది కాదంటున్నారు వైద్యులు. ఎంతో రుచిగా ఉండే బిస్కట్లను వెజిటబుల్ ఆయిల్, పంచదార, మైదాపిండితో తయారుచేస్తారు. వీటిని ఎక్కువగా తినడం వలన బరువు పెరగడంతోపాటు శరీరంలో ఎక్కువ క్యాలరీలు వచ్చి చేరుతాయి.
 
పాలు, కాఫీకి కూడా దూరంగా ఉండాలి. ఇది ఒక కప్పు తాగినా శరీరంలో క్యాలరీలు బాగా పెరుగుతాయి. ఉదాహరణకు ఒక చిన్న కప్పుతో తాగిన మిల్కుకాఫీతో 80-100 క్యాలరీలు ఉంటాయి. రోజులో మనం తీసుకునే ఒక అదనపు మీల్‌తో ఇది సమానం. అందుకే ఆఫీసులో దీనికి దూరంగా ఉండాలి. లేకపోతే బరువు విపరీతంగా పెరిగిపోతారు.
 
కొందరు కేక్స్ బాగా తింటుంటారు. సింగిల్ కేక్‌లో 10-12 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. అంతేనా.. 300 నుండి 400 క్యాలరీలు కూడా అందులో ఉంటాయి. వీటిని వారంలో ఓ నాలుగైదుసార్లు కంటే ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. అందుకే వర్క్ ప్లేస్‌లో ఎవరు కేక్‌ను ఆఫర్ చేసినా వద్దని నిర్మొహమాటంగా చెప్పండి. లేదంటే బరువు పెరగాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.