బెండకాయను నిలువుగా చీల్చి వాటిని గ్లాసు నీళ్లలో?

ladice finger
సందీప్| Last Updated: గురువారం, 21 మార్చి 2019 (14:38 IST)
మన వంటకాలలో నిత్యం ఉపయోగించే కూరగాయలలో ఒకటి. దీనిలో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. బెండకాయ మాంసకృత్తులు, పీచుపదార్థాలు, ఫోలెట్, కాల్షియం మొదలైన వాటికి పెట్టింది పేరు. వీటితో పాటు బెండకాయలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం, రాగి, మాంగనీసు, జింక్ వంటివి సూక్ష్మ పరిమాణాలలో ఉన్నాయి. 
 
అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బెండకాయ తినడం వలన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీని దరిచేరనివ్వదు. అంతేకాకుండా దీనిలోని పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది, విటమిన్‌ సి చాలా ఎక్కువగా ఉంటుంది. 
 
బెండకాయకు ఉన్న డయూరిటిక్ లక్షణాల వల్ల యూనరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌‌ను నయం చేయవచ్చు. బెండ పైత్యాన్ని తగ్గిస్తుందని, వాతాన్ని నివారిస్తుందని, వీర్య వృద్ధి చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బెండకాయను చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారాక తాగితే జ్వరం తగ్గుతుంది. డయాబెటీస్ సమస్యతో బాధపడేవారు కూడా బెండకాయ తింటే మంచిది.
 
బెండకాయను నిలువుగా చీల్చి వాటిని గ్లాసు నీళ్లలో రాత్రంతా ఉంచి తెల్లవారి తాగాలి. అలా రెండు వారాలు చేస్తే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. దీనిలో ఉండే పెక్టిన్‌ బ్లడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బెండకాయల్లో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషక పదార్థాలతో పాటు అయోడిన్‌ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్‌ వ్యాధి రాకుండా చేస్తుంది.దీనిపై మరింత చదవండి :