పురుషుల్లో ఆ శృంగార సమస్య... అక్కడ నిలబడితే చాలు...

సిహెచ్| Last Modified శుక్రవారం, 9 నవంబరు 2018 (18:21 IST)
సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా పురుషుల్లో దాదాపు 40 నుంచి 50 శాతం మందికి శృంగార సంబంధ సమస్య ఉంటుందని కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. అయినప్పటికీ.. ఏ ఒక్కరూ బయటకు చెప్పుకోలేరు. పైగా... ఈ సమస్య నుంచి బయటపడేందుకు వీలుగా అత్యంత ఖరీదైన మందులు వాడుతుంటారు. కానీ ఆ... సమస్య నుంచి పూర్తిగా బయటపడలేరు.
 
ఈ నేపథ్యంలో జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే... శృంగారం చేయలేక నిస్సత్తువతో వుండేవారు ప్రతి రోజూ ఉదయం పూట కాసేపు నీరెండలో సేద తీరడమే సహజసిద్ధ వైద్యమని తెలిపారు.
 
ప్రతిరోజూ ఉదయం సమయంలో ఎండలో గడిపేవారికి ఈ సమస్య ఉత్పన్నం కావడం లేదని తమ పరిశోధనలో తేలినట్టు వారు వెల్లడించారు. అంతేకాకుండా, విటమిన్-డి కి స్తంభన సమస్యను నివారించే శక్తి ఉందని, ఇది సూర్యరశ్మి ద్వారా పుష్కలంగా లభిస్తుందని, అందుకే ప్రతి రోజూ ఉదయం సన్‌బాత్ చేయడం వల్ల స్తంభన సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని తెలిపారు. ఈ సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మంచి డైట్ పాటించినట్టయితే సమస్య దరిచేరదని పరిశోధకులు చెపుతున్నారు.దీనిపై మరింత చదవండి :