శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (13:31 IST)

మహిళలు గర్భంతో వుంటే.. కాస్మెటిక్స్‌కు దూరంగా వుండాలట..

మహిళలు గర్భంగా వున్నప్పుడు కాస్మెటిక్స్‌కు దూరంగా వుండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహిళలు గర్భవతిగా వున్నప్పుడు... మాయిశ్చరైజర్లు, లిప్‌స్టిక్‌లు ఎక్కువగా వాడటం వలన పుట్టే పిల్లలకు అభ్యాస సామర్థ్యం తక్కువగా వుంటుందని అమెరికాలోని కొలంబియా వర్శిటీ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో తేల్చారు. 
 
ఈ లోపంతో పుట్టిన పిల్లలకు కౌమార దశలో దీని ప్రభావం ఉంటుందని, వారిలో ఏదైనా విషయాన్ని నేర్చుకునే సామర్థ్యం సన్నగిల్లుతుందని పరిశోధకులు తెలిపారు. 
 
సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగించే పతాలెట్స్‌ అనే ప్లాస్టిక్‌ రసాయనాలు దీనికి ప్రధాన కారణమని పరిశోధకులు వెల్లడించారు. మహిళల నుంచి సేకరించిన మూత్ర నమూనాల ఆధారంగా వారిలోని పతాలెట్స్‌, జీవక్రియ స్థాయిలను అంచనా వేశారు. 
 
గర్భంలో ఉన్న సమయంలో పతాలెట్స్‌ ప్రభావానికి గురికావడం వలన చిన్నారుల్లో ముఖ్యంగా బాలికల్లో మోటార్‌ స్కిల్స్‌ తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.