చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు..

గురువారం, 12 అక్టోబరు 2017 (10:11 IST)

బాదం, జీడిపప్పులను తీసుకోవడం ద్వారా అందులో మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. పిస్తాలోని బీ6 విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరాలు రక్తనాళాలను గట్టిపడనీయకుండా చేస్తాయి. ఎండుద్రాక్ష, ఖుబానీ వంటి వాటిల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రక్తహీనత బారినపడకుండా కాపాడతాయి.
 
జీడిపప్పులో కొలెస్ట్రాల్‌ అసలే ఉండదు. పిస్తాలోని మంచి కొవ్వులు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలోని ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడతాయి. ఎండుద్రాక్షలో విటమిన్‌ ఎ, క్యాల్షియం పుష్కలంగా వుంటాయి. ఇవి ఎముక పుష్టికి, చూపు బాగుండటానికి దోహదం చేస్తాయి. 
 
జీడిపప్పులోని మెగ్నీషియం, క్యాల్షియం కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదంపప్పులో క్యాల్షియంతో పాటు విటమిన్‌ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాదు.. చర్మం ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిది. ఎందుకంటే గుండెను కాపాడే ఫ్లావనాయిడ్లు ఈ పొట్టులోనే ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వీర్యకణాల వృద్ధికి లవంగాలు..

తేనె, కొన్ని చుక్కల లవంగం నూనెను గోరువెచ్చటి నీటిలో కలిపి రోజులో మూడుసార్లు తాగితే జలుబు ...

news

గుండెజబ్బుతో బాధపడేవారు.. రోజూ జామపండును తీసుకుంటే?

గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ...

news

శొంఠి ఇంట్లో వుంటే.. ఎంతో మేలు

వర్షాకాలం శొంఠి ఇంట్లో వుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో తరచూ తడవడం వల్ల ...

news

మునగాకు రసాన్ని నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాసుకుంటే..?

మునగాకు రసాన్ని, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి ప్రతి రోజూ ఉదయం రాసుకుంటే మొటిమలను దూరం ...