శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (17:27 IST)

పైల్స్ నివారణకు నీళ్లెక్కువ తాగాల్సిందే..

పైల్స్ నివారణకు సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోవటం వలన ఈ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు. బ్రోకలీ, ఉల్లిపాయలు, దోసకాయలు, క్యారెట్లు, కాలీఫ్లవర్, పుట్టగొడుగు వంటి విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆకుపచ్చ కూరగాయలను అధికంగా తీసుకోండి. వీలైతే, బొప్పాయిని రోజూ తీసుకోవాలి. 
 
ఈ పండులో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కనుక, ప్రతి రోజూ ఒకటి లేదా రెండు ముక్కలు బొప్పాయిని తీసుకోవడం ద్వారా పైల్స్ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. అలాగే ప్రతిరోజూ ఉదయం లేదా ప్రతి భోజనం తర్వాత అరటిపండును తినడం చేస్తే పైల్స్ సమస్య వుండదు.  
 
ఇకపోతే.. పైల్స్‌తో బాధపడుతున్న రోగులకు బ్రౌన్ రైస్ చాలా మేలు చేస్తుంది. అలాగే నిజంగా పైల్స్ వదిలించుకోవాలని కోరుకుంటే నీటిని ఎక్కువగా తాగాలి.  నీరు త్రాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అధికరించి పైల్స్ సమస్యను తొలగిస్తుంది.