ముల్లంగి కూర తింటే ఎంత మేలో తెలుసా?

Radish Gravy
సెల్వి| Last Updated: మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:51 IST)
Gravy
అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్‌తో బాధపడేవారు తింటే మేలు జరుగుతుంది. ఆకలి తగ్గుతుంది. ముల్లంగి గింజల్ని నీటిలో నానబెట్టి గుజ్జులా చేసుకుని చర్మ సమస్యలున్న ప్రాంతంలో రాస్తే అవి తగ్గిపోతాయి. అవే గింజల్ని పొడిచేసి నీళ్లలో కలిపి రాత్రి తాగితే కడుపులో పురుగులు, క్రిముల వంటివి చనిపోతాయి.

ముల్లంగి గింజల్ని బాగా నూరి ఫేస్‌ మాస్క్‌లా రాసుకొని గంట తర్వాత నీటితో కడుక్కుంటే ముఖంపై మచ్చలు, మొటిమలు, చారల వంటివి తొలగిపోతాయి. విటమిన్లు, పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉండే ముల్లంగి ఆకుల్ని నీటిలో ఉడకబెట్టి అందులో నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేసి తాగితే… మూత్ర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.

అలాగే ఆహారం జీర్ణం అవ్వకుండా ఇబ్బంది పడేవాళ్లు… భోజనం తర్వాత ముల్లంగిలో మిరియాల పొడి కలిపి తినేయాలి. ఎలాగంటే… ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు చేసి, అందులో మిరియాల పొడి, నిమ్మరసం వెయ్యాలి. కాస్త ఉప్పు కూడా వేసుకొని… రోజుకు మూడు సార్లు తింటే చాలు. మలబద్ధకం, మొలలు, కామెర్ల వంటి సమస్యలు దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :