శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 23 నవంబరు 2016 (13:31 IST)

పచ్చి కొబ్బరిని తింటున్నారా? బరువు తగ్గిపోతారంతే..? నిజమా?

పచ్చి కొబ్బరిని పచ్చళ్లు నూరేయడం కాకుండా.. పళ్లతో కొరికి తింటున్నారా? అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి కొబ్బరిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన

పచ్చి కొబ్బరిని పచ్చళ్లు నూరేయడం కాకుండా.. పళ్లతో కొరికి తింటున్నారా? అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చి కొబ్బరిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని వారు చెప్తున్నారు. గుండె సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరి తింటే మేలే. ఇందులోని కొలెస్ట్రాల్.. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కొబ్బరిలోని గుడ్ కొలెస్ట్రాల్.. బరువును కూడా తగ్గిస్తుంది. 
 
ఇంకా పచ్చి కొబ్బరిలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నాలుగైదు ముక్కలు తింటే చాలు శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎక్కువగా ఆటలాడే పిల్లలకు పచ్చికొబ్బరిని తినిపించవచ్చు. కొబ్బరి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. చర్మానికీ మేలు జరుగుతుంది. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెట్టవచ్చు. కొబ్బరిని తినడం ద్వారా థైరాయిడ్‌ సమస్య అదుపులో ఉంటుంది. మూత్రనాళాల ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టవచ్చు. కొబ్బరి ఎముకలు, దంతాలు, గోళ్ళకు మేలు చేస్తాయి. నోటిపూతను నయం చేస్తుంది.