1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 3 నవంబరు 2018 (11:21 IST)

పరుగులు పెడితే.. డయాబెటీస్ రాదంతే...

పరుగులు పెడుతున్నారా? అయితే డయాబెటిస్ రాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు.. ఇంటికొస్తే టీవీల ముందు కూర్చునే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఇందుకు ప్రతిఫలంగా గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, ఒబిసిటీ ఆవహిస్తున్నాయి. వీటిని దూరం చేసుకోవాలంటే.. పరుగులు తీయాలని వైద్యులు చెప్తున్నారు. 
 
ఆరోగ్యం కోసం ప్రతి ఉదయం పరుగులు తీస్తూ.. వ్యాయామం పేరిట కాస్త శ్రమపడితే.. అనారోగ్య సమస్యలు మాయమవుతాయని వారు సూచిస్తున్నారు. పరుగెత్తేవాళ్లలో డయాబెటీస్‌ రాకుండా ఉండడానికి 12.1 శాతం అవకాశం ఉంటే.. నడిచేవారిలో అది 12.3 శాతంగా ఉంటుందట. నడక అనేది.. గుండెజబ్బుల ప్రమాదాన్ని 9 శాతం మేరకు తగ్గిస్తే.. పరుగెత్తేవాళ్లలో 4.5 శాతం మాత్రమే తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. అందుచేత పరుగులు ఆరోగ్యానికి మేలేనని వైద్యులు చెప్తున్నారు. 
 
అలాగే బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి కీడు చేస్తాయి. అందుచేత ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో నడక, జాగింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. బీపీ, కొవ్వు వంటి గుండె ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నియంత్రించడంలో పరుగు చేసే మేలును నడక వ్యాయామం కూడా చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.