గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2016 (12:29 IST)

రోజూ కాసేపు ఎండలో నిలబడండి.. ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసుకోండి..!

ఏసీల కింద కూర్చుని గంటల తరబడి కంప్యూటర్లను కంటి చూస్తూ రోజంతా గడిపేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతోంది. శారీరక శ్రమ లేని పనులు చేస్తూ చాలామంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఒబిసిటీ కారణంగా

ఏసీల కింద కూర్చుని గంటల తరబడి కంప్యూటర్లను కంటి చూస్తూ రోజంతా గడిపేసేవారి సంఖ్య రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతోంది. శారీరక శ్రమ లేని పనులు చేస్తూ చాలామంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఒబిసిటీ కారణంగా అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఇలా కంప్యూటర్ల ముందే అతుక్కుపోతున్న వారు రోజూ ఓ అరగంట ఎండలో నిలబడితే చాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతామని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
రోజూ కాసేపు ఎండలో ఉంటే శరీరానికి డి విటమిన్ అనే పోషకం చేరుతుంది. ఇక, కొవ్వులేని పాలతో చేసిన పదార్థాల ద్వారానూ ఈ విటమిన్‌ అందుతుంది. విటమిన్ డి ద్వారా  ఎముకలు దృఢంగా మారతాయి. చర్మానికీ మేలు జరుగుతుంది.
 
ఇక రోజూ కేవలం గ్లాసుడు పాలు తాగడం ద్వారా శరీరానికి సరిపడే క్యాల్షియం అందకపోవచ్చు. అందుచేత ఇతర డైరీ ఉత్పత్తులు చేర్చుకోవాలి. అలాగే టోఫు, చేపలూ..లాంటివాటి నుంచి ఆ పోషకాన్ని అందుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల గుండె, కండరాలకు చాలా మంచిది. ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది అధికరక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.
 
ఆలివ్‌నూనె, వాల్‌నట్లు, బాదం లాంటివీ తీసుకోవాలి. ఇంకా విటమిన్‌ బి12 పోషకం లోపం ఉన్నప్పుడు వయసురీత్యా సమస్యలు పెరుగుతాయి. చేపలు, మాంసం, గుడ్లు, చికెన్, పాలు వంటి పదార్థాల్లో ఈ పోషకం ఎక్కువగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.