శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 డిశెంబరు 2016 (12:29 IST)

చేపలను తినాలంటే.. వేయించకూడదు.. బేక్ చేసి బాయిల్ చేసి తినాలి..

మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతోపాటు కంటిచూపు తగ్గుతుంది. వారానికి రెండుసార్లు చేపలు తినడం.. 500 మిల్లీ గ్రాముల ఒమేగా-3తో సమానమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివా

మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యలతోపాటు కంటిచూపు తగ్గుతుంది. వారానికి రెండుసార్లు చేపలు తినడం.. 500 మిల్లీ గ్రాముల ఒమేగా-3తో సమానమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చు.
 
అందుకే చికెన్‌, మటన్‌ అంటే లొట్టలేసుకుంటూ తినే అనేకమంది మాంసాహారులు చేపలు తినాలంటే మాత్రం చిన్నచూపు చూస్తారు. కానీ చేపల్ని వీలైనంత వరకు ఆహారంలో తీసుకోవడం ద్వారా గుండెజబ్బులు స్ట్రోక్స్, డిప్రెషన్, అల్జీమర్స్ వ్యాధి వంటివి తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

అంతేకాదు, రెగ్యులర్‌గా చేపలు తినేవారిలో జ్ఞాపకశక్తి, సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. కానీ చేపలను వేయించకుండా.. బేక్ చేసి లేదా బాయిల్ చేసి తినాలని అప్పుడే అందులో పోషకాలు శరీరానికి అందుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.