శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (14:22 IST)

చేపలు, పీతలు, రొయ్యలు తినండి.. మధుమేహానికి చెక్ పెట్టండి..

పీతలు, చేపలు వంటి సీ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పీతల్లో ప్రోటీన్లు, కొవ్వులు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-సి, బి6, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటా

పీతలు, చేపలు వంటి సీ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పీతల్లో ప్రోటీన్లు, కొవ్వులు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-సి, బి6, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అలా చేపల్లో ప్రోటీన్లు, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా వుంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు మెదడుకు మేలు చేస్తాయి.
 
పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యానికి కూడా చేపలు ఉపయోగపడతాయి. మధుమేహంతో బాధపడే వారు తరచు చేపలను తినడం ఎంతో మంచిది. అలాగే పీతలు మధుమేహ రోగుల ఆరోగ్యానికి పీతలు మేలు చేస్తాయి. దంతాలు, ఎముకలకు దారుఢ్యాన్నిస్తాయి. నాడీ వ్యవస్థకు, గుండెకు బలాన్నిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. 
 
ఇక రొయ్యల్లోనూ కొవ్వులు, విటమిన్లు, ప్రోటీన్లు, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు వుంటాయి. రొయ్యలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. దంతాలకు, ఎముకలకు మేలు చేస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్లకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి.