Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ సమస్య వున్నవారు రెండు గంటలకోసారి తులసి ఆకులను నమిలితే...

మంగళవారం, 22 ఆగస్టు 2017 (20:49 IST)

Widgets Magazine

భారతీయులకు పవిత్రమైన చెట్టు తులసి ముఖ్యంగా హిందువులకు పూజనీయమైన చెట్టు ఇది. తులసి లోని ఔషధగుణాలు కోకొల్లలు. తులసి అనేక రకాలు ఉంటుంది. ఊదా రంగు కాండము, నీల ఛాయగల లేత ఎరుపు పూలను పూసే చెట్టును కృష్ణ తులసి అని అంటారు. లేత ఆకుపచ్చ కాండము తెల్లని పూలను పూసే తులసిచెట్టును లక్ష్మీతులసి అని పిలుస్తూ వుంటారు. 
 
తులసి రకాల్లో దేన్నైనా సరే రెండు లేక మూడు ఆకుల్ని నమిలి తింటూ వుంటే బ్రాంకైటిస్ వ్యాధి తగ్గుతుంది. సమస్య వున్నప్పుడు ఈ విధంగా ప్రతి రెండు గంటలకు తింటు వుండాలి. తులసికి కడుపులోని క్రిములను పారద్రోలే శక్తి వుంది దీనిని వాడటం వలన రక్తహీనత కూడా నివారించబడుతుంది. తులసి ఆకులకు నాలుగు మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకొని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడ జీర్ణమవుతుంది. 
 
జీర్ణ శక్తికి ఇది మంచి మందు. ఉబ్బసాన్ని నివారించడంలో తులసి ముఖ్యమైన ఔషధం. ఉబ్బసం ఉన్నవారు తరుచు తులసి కషాయం తీసుకుంటే కొన్నాళ్ళకు ఉబ్బసం రాదు. తులసి జ్వరహారిణి, సాధారణ జ్వరాలు ఏవి వచ్చినా తులసి ఆకులతో కషాయం కాచి తాగితే తగ్గిపోతుంది. అంతేకాదు టైఫాయిడ్ జ్వరములో తులసి చెట్టు కాండమును బాగా దంచి కషాయం కాచి ప్రతిపూట త్రాగుతుంటే జ్వరం నెమ్మదిస్తుంది. 
 
అవసాన దశలో వున్న మనిషికి తలసి తీర్థంపోయడంలో వారి గొంతులో కఫం ఏవైనా అడ్డుపడకుండా శ్వాస సరిగ్గా తీసుకుంటారని ఆవిధంగా చేస్తారు. అందుకే తులసి సర్వ రోగనివారణి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అల్సర్ వుంటే అల్లం తినొద్దు..

వైద్యుల సలహా లేకుండా అల్సర్‌తో బాధపడేవారు అల్లం ఎక్కువగా తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు ...

news

మెడ సౌందర్యాన్ని మెరుగు పెంచే ఎగ్ ప్యాక్..

ముఖాన్ని స్క్రబ్ చేసేటప్పుడు మెడపై కూడా స్క్రబ్ చేయాలి. మెడ భాగంలోనే చెమట పడుతుంది. ...

news

ఫ్రూట్ మిక్సర్ తాగుతున్నారా? కాస్త ఆగండి

ఎండాకాలం పోయినా.. చినుకులు పడుతున్నా.. చల్లగా కాకుండా విత్ అవుట్ ఐస్‌తో ఫ్రూట్ మిక్సర్ ...

news

ఒక్క స్పూన్ నువ్వులతో మీ ఆరోగ్యం పదిలం.. ఎలా..?

నువ్వులు తింటే వేడి చేస్తాయని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ గుప్పెడు నువ్వులతో ఎన్నో ...

Widgets Magazine