శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 21 ఆగస్టు 2017 (17:00 IST)

కలబంద వేర్లను పాలలో ఉడికించి ఎండబెట్టి పొడి చేసి తీసుకుంటే...

కలబందతో అనేక ఆరోగ్య ప్రయోజలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ అరకప్పు కలబంద గుజ్జును తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కలబంద జెల్లీని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అలాగే కలబంద గుజ్జు దాంతప్య జీవ

కలబందతో అనేక ఆరోగ్య ప్రయోజలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ అరకప్పు కలబంద గుజ్జును తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కలబంద జెల్లీని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అలాగే కలబంద గుజ్జు దాంతప్య జీవనానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
కలబంద వేర్లను శుభ్రం చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో పాలను పోసి అందులో కలబంద వేర్లను ఉడికించాలి. వాటిని పాల నుంచి తీసి బాగా ఎండబెట్టి పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని రోజుకో టీ స్పూన్ లెక్కన పాలులో కలిపి తీసుకుంటే దాంపత్యం పండుతుంది. 
 
ఇంకా జుట్టు పెరగాలంటే ఓ పాత్రలో అలోవెరా జెల్ తీసుకొని అందులో పటిక ఉప్పు కాసింత చేర్చి 20 నిమిషాల పాటు పక్కనబెట్టాలి. కాసేపయ్యాక జెల్ కాస్త నీరుగా మారిపోతుంది. ఆ నీటిని నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేర్చి బాగా మరిగించి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుంటే జుట్టు బాగా వత్తుగా పెరుగుతుంది.
 
అలోవెరాతో శరీరంలోని మలినాలను తొలగించుకోవచ్చు. అలోవెరా జెల్‌ను రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు. అంతేకాకుండా నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. అలోవెరాను తీసుకోవడం ద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.