శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (12:08 IST)

ఏ నెలలో పుట్టారు.. ఏ వ్యాధి వస్తుంది?

ప్రతి ఒక్కరికీ రాశిఫలాలు, జాతక చక్రాలపై అపార నమ్మకం ఉంటుంది. దీంతో తమ రాశికి ఎలాంటి శుభ, అశుభ శకునాలు జరుగుతాయనే విషయం తెలుసుకునేందుకు అమితాసక్తిని చూపుతుంటారు.

ప్రతి ఒక్కరికీ రాశిఫలాలు, జాతక చక్రాలపై అపార నమ్మకం ఉంటుంది. దీంతో తమ రాశికి ఎలాంటి శుభ, అశుభ శకునాలు జరుగుతాయనే విషయం తెలుసుకునేందుకు అమితాసక్తిని చూపుతుంటారు. తాజాగా జరిపిన ఓ పరిశోధనలో పుట్టిన నెలలను బట్టి వ్యక్తులకు వచ్చే వ్యాధులను చెప్పేయొచ్చట. ఆయా నెలలలో పుడితే.. 27 రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అలికంట్ పరిశోధకులు చెపుతున్నారు. ఈ పరిశోధన కోసం వీరు సుమారు 30 వేల మందిని ఎంచుకున్నారు.
 
శీతాకాలంలో అతినీలలోహిత కిరణాలు, విటమిన్ డీ స్థాయిల్లో భేదాలు, వైరస్‌లు స్త్రీలలో పిండం ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. అలాగే సెప్టెంబరు నెలలో పురుషుల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తాయంటున్నారు. అదేవిధంగా జూలైలో పుట్టిన స్త్రీలలో 27 శాతం మందికి హై బీపీ ఉండే అవకాశముందని.. 40 శాతం మంది నిగ్రహం కోల్పోయే గుణాన్ని కలిగివుంటారని చెబుతున్నారు. అయితే, నెలవారీగా స్త్రీపురుషుల్లో వచ్చే వ్యాధులను పరిశీలిస్తే, 
 
జనవరి:
పురుషులు: మలబద్ధకం, అల్సర్, వెన్నునొప్పి.
స్త్రీలు: మైగ్రేయిన్, రుతుక్రమ సమస్యలు, గుండెపోటు.
 
ఫిబ్రవరి:
పురుషులు: థైరాయిడ్ సమస్యలు, గుండె సమస్యలు, కీళ్లనొప్పి.
స్త్రీలు: కీళ్లనొప్పి, థైరాయిడ్ సమస్యలు, రక్తం గడ్డకట్టుట.
 
మార్చి: 
పురుషులు: శుక్ల సమస్యలు, గుండె జబ్బులు, ఆస్తమా.
స్త్రీ: కీళ్లవాతం, వాతరోగం, మలబద్ధకం.
 
ఏప్రిల్:
పురుషులు: ఆస్తమా, ఎముకల వ్యాధి, థైరాయిడ్ సమస్యలు.
స్త్రీలు: ఎముకల వ్యాధి, ట్యూమర్, శ్వాసనాళాల వాపు.
 
మే:  
పురుషులు: ఒత్తిడి, ఆస్తమా, డయాబెటీస్.
స్త్రీలు: దీర్ఘకాళిక వ్యాధులు, ఎముకల వ్యాధి, మలబద్ధకం.
 
జూన్:
పురుషులు: గుండె సంబంధిత సమస్యలు, కంటి శుక్లాల వ్యాధులు, దీర్ఘకాలిక శ్వాసనాళాల వాపు.
స్త్రీలు: నిగ్రహం కోల్పోవడం, కీళ్లవాతం, వాతరోగం.
 
జూలై:
పురుషులు: కీళ్లవాతం, ఆస్తమా, ట్యూమర్స్.
స్త్రీలు: మెడనొప్పి, ఆస్తమా, ట్యూమర్స్.
 
ఆగస్టు: 
పురుషులు: ఆస్తమా, ఎముకల వ్యాధి, థైరాయిడ్ సమస్యలు.
స్త్రీలు: రక్తం గడ్డకట్టుట, కీళ్లవాతం, వాతరోగం.
 
సెప్టెంబరు:
పురుషులు: ఆస్తమా, కీళ్లవాతం, థైరాయిడ్ సమస్యలు.
స్త్రీలు: కీళ్లవాతం, థైరాయిడ్ సమస్యలు, హానికరమైన ట్యూమర్లు.
 
అక్టోబరు:
పురుషులు: థైరాయిడ్ సమస్యలు, కీళ్లవాతం, మైగ్రేయిన్.
స్త్రీలు: అధిక కొవ్వు, కీళ్లవాతం, పాండురోగం.
 
నవంబరు:
పురుషులు: దీర్ఘకాలిక చర్మవ్యాధులు, గుండె సమస్యలు, థైరాయిడ్ సమస్యలు.
స్త్రీలు: మలబద్ధకం, గుండెపోటు, నరాలు ఉబ్బుట.
 
డిసెంబరు:
పురుషులు: శుక్లసంబంధిత వ్యాధులు, ఒత్తిడి, హృదయ స్పందనలు.
స్త్రీలు: శ్వాసనాళాల వాపు, ఆస్తమా, రక్తం గడ్డకట్టుట.