మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 10 అక్టోబరు 2017 (09:33 IST)

శాకాహారం తీసుకోండి.. ఎక్కువకాలం జీవించండి.

శాకాహారం ఆయుష్షును పెంచతుంది. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఎక్కు

శాకాహారం ఆయుష్షును పెంచతుంది. కూరగాయల్లో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి ఎక్కువకాలం జీవిస్తారు. గుండె, ఊపిరితిత్తులు వంటి అన్ని అవయవాల పనితీరు సక్రమంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం తీసుకోవడమే ఉత్తమం.
 
మాంసాహారం తినేవాళ్లకంటే.. శాకాహారులు స్లిమ్‌గా వుంటారు. శాకాహారంలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందుకే శాకాహారానికి అలవాటు పడితే బరువు తగ్గుతారు. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. రక్తప్రసరణ సరిగా జరిగి.. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కూరగాయల్లో ఐరన్, పోషకాలు సమృద్దిగా ఉంటాయి కాబట్టి హృద్రోగాలకు దూరంగా ఉండవచ్చు. 
 
శాకాహారం తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌గా ఉంటుంది. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. రక్తపోటు అదుపులో ఉంటుంది. వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మధుమేహం రావడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.