ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (12:53 IST)

కొత్తగా పెళ్లయ్యిందా...? కాస్త అలా నడిచి చూడండి..

మీకు కొత్తగా పెళ్లయ్యిందా.. అయితే కాస్త అలా నడిచి చూడండి.. అంటున్నారు.. మానసిక నిపుణులు. ఎందుకంటే.. మీ అనుబంధాన్ని పెంచుకునేందుకు ఈ నడక సహాయపడుతుందట. కొత్తగా పెళ్లైన దంపతులు రోజూ ఉదయాన్నే కాసేపు పది న

మీకు కొత్తగా పెళ్లయ్యిందా.. అయితే కాస్త అలా నడిచి చూడండి.. అంటున్నారు.. మానసిక నిపుణులు. ఎందుకంటే.. మీ అనుబంధాన్ని పెంచుకునేందుకు ఈ నడక సహాయపడుతుందట. కొత్తగా పెళ్లైన దంపతులు రోజూ ఉదయాన్నే కాసేపు పది నిమిషాల పాటు నడిస్తే ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి మేలు చేసిన వారవుతారు. ఇలా చేస్తే భావోద్వేగాలు అదుపులో వుంటాయి. బరువు కూడా తగ్గుతారు. 
 
అంతేకాదు.. బాగా కోపంగా వున్నప్పుడు.. ఆవేశాన్ని తగ్గించుకోవాలంటే.. అలా బయటికి వెళ్లి పచ్చగడ్డిలో అటూ ఇటూ ఓ పది నిమిషాలు నడిస్తే చాలు. ఎందుకంటే.. ఆ సమయంలో విడుదలయ్యే అడ్రినలిన్ హార్మోన్ ఒత్తిడిని అదుపులో వుంచుతుంది. అలా కోపం కూడా తగ్గిపోతుందని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే నిద్రలేమితో బాధపడేవారికి వాకింగ్ మేలు చేస్తుంది. రోజూ దినచర్యకు అరగంట ముందు మొదలుపెట్టి నడకను ప్రారంభించండి. కనీసం ఓ అరగంటైనా శరీరాన్ని మొత్తం కదిలిస్తూ బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా కండరానికి మర్దన చేసిన ఫలితం వుంటుంది. తద్వారా రాత్రిపూట హాయిగా నిద్ర అందుతుందని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు.