బరువు తగ్గాలంటే.. బ్రేక్‌ఫాస్ట్‌లో పుచ్చకాయను తీసుకోవాలట..
నెగటివ్ కేలరీస్ ఆహారాన్ని అల్పాహారంలో తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. లో-కెలోరీల ఆహారం అంటే పుచ్చకాయ, నిమ్మ వంటివే. ఈ లో-కెలోరీ ఫుడ్ బరువును తగ్గించడంలో భాగంగా కొవ్వును కరిగిస్తుందట.
పండ్లు, పచ్చని కూరగాయలు, ఆకుకూరలు కూడా లో- కెలోరీల ఆహారంగా పరిగణింబడతాయి. ముఖ్యంగా ఆపిల్ బరువు తగ్గిస్తుంది. ఇది రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. అలాగే అల్పాహారంలో బెర్రీస్‌ను తీసుకుంటే ఒబిసిటికి చెక్ పెట్టవచ్చు.
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ తీసుకుంటే వాటిలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్.. గుండెను ఆరోగ్యంగా వుంచుతాయి. ఇక పుచ్చకాయలను అల్పాహారంలో తీసుకుంటే తప్పకుండా బాన పొట్ట తగ్గిపోతుంది. ఇందులో 95 శాతం నీరు వుండటంతో.. బరువును తగ్గించడంలో ఇది చక్కగా పనిచేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచే పుచ్చకాయలు.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి.
ఇకపోతే.. గ్లాసుడు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం చెరో స్పూన్ కలుపుకుని తాగితే.. పొట్ట ఇట్టే తగ్గిపోతుంది. ఇంకా రోజుకో గ్లాసుడు లెమన్ జ్యూస్ పరగడుపున తాగితే పొట్ట తగ్గిపోతుంది. అలాగే ద్రాక్ష పండ్లు కూడా బరువును తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. చర్మానికి మెరుగునిస్తాయని న్యూట్రీషియన్లు చెప్తున్నారు.