సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (13:48 IST)

బరువు తగ్గాలంటే.. ఉడికించిన కోడిగుడ్డు తీసుకోండి..

బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే అల్పాహారంగా ఓట్స్‌, ఉడికించిన గుడ్డూ, పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితంగా ఉదయం పూట అల్పాహారం మానేయడం కూడదు. రోజంతా ఉత్సాహంగా వుండేందుకు అల్ప

బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే అల్పాహారంగా ఓట్స్‌, ఉడికించిన గుడ్డూ, పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కచ్చితంగా ఉదయం పూట అల్పాహారం మానేయడం కూడదు. రోజంతా ఉత్సాహంగా వుండేందుకు అల్పాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఉదయం మాంసకృత్తులతో నిండిన అల్పాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 
 
ఇంకా బరువు తగ్గాలనుకునే వారు కొవ్వు పదార్థాలు మానేయాలని లేదు. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎంచుకోవాలి. ఆలివ్‌, కొబ్బరి, బాదం నూనెలను మీ భోజనంలో చేర్చుకోవాలి. అలాగే బాదం, వాల్‌నట్లూ, పిస్తా వంటివీ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తీసుకునే ఆహారంలో ప్రాసెస్ చేసిన పదార్థాలు లేకుండా చూసుకోవాలి. 
 
చక్కెర, ఉప్పు శాతం ఎక్కువగా పదార్థాలను తీసుకోకపోవడం మంచిది. ఉపవాసం ఉండటం వల్ల చాలామంది బరువు తగ్గుతామని అనుకుంటారు. అది నిజం కాదు. పండ్లో, పాలు ఉపవాసం వున్న పూట తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.