గ్రీన్ టీ అధికంగా తీసుకుంటే ఏమవుతుంది?
ప్రతి ఆహారం లేదా పానీయం కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇందుకు గ్రీన్ టీ భిన్నమైనది ఏమీ కాదు. గ్రీన్ టీ ప్రయోజనకరమైన ఫలితాలతో పాటు దుష్ప్రభావాలు కూడా వున్నాయి. అయితే దానిని ఎక్కువగా తీసుకునేటప్పుడు ఇది జరుగుతుంది. కాబట్టి దీన్ని మితంగా తీసుకోవాలి. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల లోపు ఏదైనా సురక్షితం. రోజుకు 3-4 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగడం వల్ల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలు ఉండవచ్చు.
మరో వాస్తవం ఏమిటంటే దుష్ప్రభావాలు మోతాదుకు మాత్రమే పరిమితం కాదు. ఇవి అలెర్జీ లేదా సున్నితత్వానికి కూడా సంబంధించినవి. మీ రెగ్యులర్ డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యులను సంప్రదించాలి. నిమ్మరసం, తులసి టీ, అల్లం టీ, దాల్చిన చెక్క టీలు గ్రీన్ టీకి అద్భుతమైన ప్రత్యామ్నాయాలు. ఇవి ఔషధ లక్షణాలను కలిగి వున్నాయి. ఫలితంగా అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గ్రీన్ టీని మితంగా తీసుకోవడం సురక్షితం. వైద్యుని సలహా మేరకు దీన్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవచ్చు, ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు.