శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 3 జనవరి 2022 (21:54 IST)

ఎదిగే పిల్లలు ఎండు చేపలను తింటే ఏంటి లాభం?

పచ్చి చేపలు, ఎండు చేపలు. వారంలో ఒకటిరెండుసార్లు చాలామంది పచ్చి చేపలు తింటుంటారు. ఐతే కొందరు ఎండు చేపలను కూడా తింటారు. ఇవి కాస్త వాసన వస్తుంటాయి కానీ ఇందులో వుండే ప్రోటీన్లు చాలా ఎక్కువ.

 

 
ఎండిన చేపలను ప్రోటీన్ ప్రధాన వనరుగా పరిగణించవచ్చు. కానీ చాలా తక్కువ మొత్తంలో కేలరీలను అందిస్తుంది. ఎండు చేపలు తినడం వల్ల బరువు పెరగరు అధిక-నాణ్యత ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఐకోసపెంటెనోయిక్ యాసిడ్, డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్‌తో సహా ఎండు చేపల్లో వుంటాయి.

 
అంతేకాదు అయోడిన్, జింక్, రాగి, సెలీనియం, కాల్షియం కూడా వుంటాయి. కనుక వారానికో లేదంటే పదిహేనురోజులకు ఒకసారైనా ఎదిగేపిల్లలకి ఎండు చేపలు పెట్టడం మంచిది.