గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (21:14 IST)

తాయత్తుమహిమ - తావిజుమహిమ అనే పదం యొక్క అర్థం తెలుసా?

తాయత్తుని మనం చాలా అవహేళన చేస్తుంటాం. వెక్కిరిస్తుంటాం. గతంలో పుట్టిన ప్రతి బిడ్డ ఊడిన బొడ్డు (Umbilical cord)ను ఈ తాయత్తులలో పెట్టి మొలతాడుకు కట్టేవారు. దానికే మరొక పేరు "బొడ్డు తాయత్తు" మందులు లేని, వైద్యానికి అందని ఎన్నో రోగాలు ఈ బొడ్డుని అరగతీసి నాకిస్తే తగ్గేవి. ఎవరి బొడ్డు వారికే పనికొచ్చేది కనుక దాన్ని వారికి అందుబాటులో ఉంచటంకోసం చాలా తేలికైన ఖర్చులేని పని. ఒక తాయత్తు చేసి దానిలో పెట్టి ఎవరి బొడ్డుని వారి మొలకే కట్టేవారు. స్తోమత ఉన్నవారు, వెండితాయత్తులు చేయించుకునేవారు, లేనివారు ఏ రాగివో వాడుకునేవారు. ఏ మందుకు తగ్గని వ్యాధి ఎలా తగ్గిందంటే "తాయత్తు మహిమ" అనేవారు. ఈ "తాయత్తుమహిమ" అనే పదానికి అసలైన అర్థమిదే.

ఈ బొడ్డుతాడును పరీక్షించి వ్యక్తికి భవిష్యత్తులో రాబోయే వ్యాధులను గుర్తించవచ్చట. కొన్ని రకాల కేన్సర్లకు మూలకణాల చికిత్స చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తోబుట్టువుల మూలకణాలు అవసరమవుతాయి. అన్ని సందర్భాల్లో తోబుట్టువులు అందుబాటులో ఉంటారని అనుకోలేం. ఎవరి జీవితం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేరు. అందుకే బొడ్డుతాడుని దాస్తే, అది ఆ వ్యక్తికి భవిష్యత్తులో అవసరమవుతుంది. అది కూడా ఆ వ్యక్తి దగ్గరే ఉంటే, ఆపత్సమయంలో వెతికే అవసరముండదు. త్వరగా దొరుకుతుంది, మారిపోయే అవకాశం ఉండదు. అదేకాక వెండిలో చుట్టించి కట్టడం వెనుక ఆయుర్వేదం కూడా దాగి ఉంది.
 
ఆధునిక సైన్సుకూడా దీనినే నిరూపించి, ఈ స్టెంసెల్స్ కేన్సర్, జుట్టు ఊడిపోవటం, కిడ్నీ, రక్త సంబంధ వ్యాధులు, ఎముకల సమస్యలకి ఇలా ఎన్నో అంతుబట్టని, ఒక పట్టాన తగ్గని రోగాలకు కూడా పని చేస్తుందని ప్రచారం చేసుకుంటూ వాటిని భద్రపరచటానికి బ్యాంకులు తెరిచి కోట్ల వ్యాపారం చేస్తున్నారు. ఈవాళ ఒక బొడ్డుని భద్రపరచటానికి ఒక బ్యాంకు లాకర్ అద్దే సుమారు 20,000 రూపాయలుంది. ఆ అవసరం లేకుండా తాయత్తులో పెట్టుకుని మొలకు చుట్టుకుంటే అనాగరికమయింది. అవహేళన చేయబడుతుంది. వెక్కిరించబడుతుంది.
 
అవునులే, బట్ట కట్టుకోవటమే అనాగరికమన్నప్పుడు మొలతాడు, దానికొక తాయత్తు మరింత అనాగరికమే అవుతుంది. అంత ఉపయోగమున్న బొడ్డుని, ఒకరిదొకరికి మారటానికి ఆస్కారం లేకుండా తాయత్తులో పెట్టి, ఖర్చులేకుండా మొలకు కట్టుకోవటం "అజ్ఞానం". ఒకరిది మరొకరికి మారే అవకాశమున్న లాకర్లో వేలు ఖర్చుపెట్టి దాచిపెట్టటం "విజ్ఞానం"!.