1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 19 నవంబరు 2018 (14:59 IST)

ఆస్తమా వుందా.. చలికాలంలో.. జాగ్రత్త.. ఏం తీసుకోవాలంటే..?

చలికాలంలో ఆస్తమా వున్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా పేషెంట్లు కోడిగుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకూడదు. ఉప్పు అధికంగా వున్న పదార్థాలు.. ప్యాక్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. 
 
ఇక రోజుకు రెండు పూటలా కాఫీ తాగడం ద్వారా ఆస్తమా స్థాయిలు తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వున్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. రెండు చెంచాల వెల్లుల్లి, అల్లం కలిపిన టీని రోజు ఉదయం, సాయంత్రం తాగడం ద్వారా ఆస్తమా వ్యాధిని నియంత్రించుకోవచ్చు. రోజు గ్లాసుడు వేడి నీటిలో తేనెను కలుపుకుని తాగడం ద్వారా ఆస్తమా నుంచి ఉపశమనం పొందుతారు. 
 
తులసీ ఆకులు ఆస్తమాను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. తులసీ ఆకుల రసాన్ని రోజూ పరగడుపున అరస్పూన్ తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు. కొన్ని మెంతుల్ని తీసుకుని గ్లాసుడు వేడి నీటిలో వేసి ఆ మిశ్రమానికి వెల్లుల్లి రసం అరస్పూన్, తేనెను కలిపి రోజూ ఉదయాన్నే తాగితే ఉపశమం పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.