శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 11 మార్చి 2021 (15:24 IST)

World Kidney Day 2021, కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మారిన జీవన శైలి, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, స్ధూలకాయం లాంటివి కిడ్నీ సమస్యలకు కారణాలవుతున్నాయి. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. శరీరంలోని మలినాలను ఎక్కువ మెుత్తంలో విసర్జించేవి మూత్రపిండాలే. రక్తంలోని విషపదార్ధాలను, శరీరంలో అవసరానికి మించి ఉన్న నీటిని ఎప్పటికప్పుడు ఇవి తొలగిస్తూ ఉంటాయి.
 
నేటి ఆధునిక జీవితాల్లో చాలామంది సరిపడా నీళ్లు త్రాగలేకపోతున్నారు. చాలా సందర్భాలలో ఈ రాళ్లు చిన్నవిగా ఉంటూ మూత్రం ద్వారా విసర్జించబడతాయి. అయితే కొందరిలో మరీ పెద్దవై మూత్రపిండాల్లో ఉండిపోతాయి. ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. వీటిని నివారించాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. 
 
1. కిడ్నీల్లో రాళ్లు ఉన్నప్పుడు ఎక్కువుగా నీటిని త్రాగుతూ ఉండాలి. రోజుకి సుమారు 7 నుంచి 10 లీటర్ల నీటిని, ద్రవ పదార్ధాలను తీసుకుంటూ ఉండాలి.
 
2. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయానే త్రాగటం వలన కిడ్నీలో ఉన్న రాళ్లు కరిగిపోతాయి.
 
3. అరటిచెట్టు బెరడును జ్యూస్‌లా చేసి తీసుకోవటం వల్ల కిడ్నీల్లో రాళ్లు మూత్రవిసర్జనతో పాటు బయటకు వస్తాయి.
 
4. కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు చాక్లెట్లు, పాలకూర, సోయా, ఎండుచిక్కుడు, టమోటా వంటి ఆక్సలేట్ పదార్థాలు తినకూడదు.
 
5. క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. అందువల్ల అలాంటి ఆహార పదార్ధాలు శరీరానికి అందేలా చూసుకోవాలి.
 
6. కొత్తిమీర ఆకుల్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో వేసి 10 నిమిషాలు  మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజు త్రాగటం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.
 
7. గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి రోజూ త్రాగటం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది.
 
కిడ్నీల ఆరోగ్యం కోసం ఏం చేయాలి?
కిడ్నీలు శరీరంలో ఉండే అతి ముఖ్య అవయవాలు. రక్తంలోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుభ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మలినాలు తొలగించే ప్రక్రియలో వీటిలో మలినాలు నిక్షిప్తమై రాళ్ళు, ట్యూమర్‌లు రావొచ్చు. అందకే కిడ్నీలో ఉన్న మలినాలను తరుచు బయటకు పంపించడం మంచిది. కిడ్నీలలో మలినాలను సహజంగా ఎలా బయటకు పంపించాలో ఇప్పుడు చూద్దాం.
 
1. కిడ్నీలను సులభంగా శుభ్రపరచగల ఒకే ఒక సాధనం మంచినీళ్ళు. దాదాపుగా 8 నుండి 10 గ్లాసుల వరకు ప్రతిరోజు తాగాలి. ఇతరత్రా సమస్యలేం లేకుంటే ఇంకా ఎక్కువ కూడా తాగవచ్చు. నీళ్ళు టాక్సిన్ పదార్థాలను ఫిల్టర్ చేసినట్టుగా తొలగించేస్తుంది. మూత్రం క్లియర్‌గా, ఎటువంటి దుర్వాసన లేకుండా ఉంటే సరిపడా నీరు తాగుతున్నరన్నమాట, లేకపోతే ఇంకా నీళ్ళు తాగాలి అన్నట్టు.
 
2. బార్లీ ధాన్యం కిడ్నీలను శుభ్రపరచడమే కాదు,  ప్రమాదాల బారి నుండి కాపాడగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది ఫైబర్ ఎక్కువగా ఉండే ఒక హోల్ గ్రైన్. ఇది ఇంకా డయాబెటిస్ లాంటి వాటి నుండి కూడా సమర్థవంతంగా రక్షిస్తుంది. కొన్ని బార్లీ గింజలను రాత్రిళ్ళు నీళ్ళల్లో నానేసి, ఉదయాన్నే ఆ నీటిని త్రాగడంవాళ్ళ బార్లీలోని మంచి గుణాలను పూర్తిగా స్వీకరించవచ్చు.
 
3. తాజా పండ్లు, కూరగాయలు, ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉన్న వాటిని రోజువారీగా తీసుకుంటూ ఉండాలి. ద్రాక్ష, కమలాపండు, అరటిపండు, కివి, అప్రికాట్ లాంటి పండ్లలో పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా పాలు, పెరుగులో కూడా పొటాషియం పుష్కలంగానే ఉంటుంది. ముఖ్యంగా వివిధ రకాల బెర్రీస్ కిడ్నీలలో మలినాలను శుభ్రం చేస్తుంది. ఎందుకంటే.... వీటిలో ఉండే క్వినైన్ మెటబాలిజం లో హిప్యురిక్ ఆసిడ్‌గా మారి కిడ్నీ లను సమర్దవంతంగా శుభ్రం  చేస్తుంది.
 
4. ఆల్కహాల్, చాక్లేట్, కేఫిన్ల వల్ల చాల దుష్ప్రభావాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల, వీటిని అరిగించే, కరిగించే క్రమంలో కిడ్నీలపై చాలా ప్రభావం పడుతుంది. దీనితో కిడ్నీల పనితీరు తగ్గిపోతుంది. అందుకే, వీటికి దూరంగా ఉండం చాలా మంచిది.
 
కిడ్నీ సమస్యను తెలిపే లక్షణాలు
1. చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. మూత్రవిసర్జనకు కిడ్నీలకు సంబంధం ఉన్నది. అందువల్ల మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా కిడ్నీ సమస్య ఉన్నట్లు గుర్తించాలి.
 
2. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే వ్యర్థాలను శుభ్రపరిచే ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. ఫలితంగా ఆ వ్యర్థాలు రక్తంలో కలుస్తాయి. దాంతో నోట్లో చెడు రుచి కలుగుతుంది.
 
3. కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచి సామర్థ్యం మరియు ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచుగా వికారం మరియు వాంతులు వస్తాయి. ఇది రక్తంలో వ్యర్థాల ఫలితంగా జరుగుతుంది. ఈ వికారం ఆకలిని తగ్గిస్తుంది.
 
4. కిడ్నీలు ఎరిత్రోపయోటిన్ అనే హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తాయి. అవి శరీరంలో ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఒకవేళ కిడ్నీల పనితీరు తగ్గితే ఎర్రరక్తకణాల ఉత్పత్తి మీద ఆ ప్రభావం పడుతుంది. అలసట మరియు మెదడుకు సంబందించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. తీవ్రమైన సందర్భంలో రక్తహీనత వస్తుంది. కిడ్నీలు ఉండే వీపు భాగంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలు చెడిపోయినప్పుడు కనపడే సాధారణ సంకేతం.
 
5. ఈ నొప్పితో పాటు కీడ్నీలో ఇన్‌ఫెక్షన్లు, రాళ్లకు కూడా కారణమవుతుంది. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కూడా చల్లగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఇది కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనడానికి సంకేతమని వైద్యనిపుణులు చెబుతున్నారు.