శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (19:24 IST)

భారత్‌ను వణికిస్తోన్న న్యూమోనియా: గంటకు ఐదుగురు..

భారతదేశాన్ని చిన్నపిల్లలకు ఎక్కువగా వచ్చే న్యూమోనియా వణికిస్తోందని సర్వేలో తేలింది. న్యూమోనియా కారణంగా ఏటా 18.40 లక్షల మంది చిన్నారులు బలవుతున్నారని సర్వే స్పష్టం చేసింది.
 
కేవలం బీహార్‌లోనే ఏటా 40,480 మంది చిన్నారులు మరణిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఆ లెక్కన ప్రతి గంటకూ ఐదుగురు చిన్నారులు న్యూమోనియా కారణంగా మృత్యువాతపడుతుండగా, ప్రతి రోజూ 100 మంది చిన్నారులు మరణిస్తున్నారని సర్వే తెలిపింది. మరి న్యూమోనియా నివారణకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.