శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 30 జులై 2014 (14:24 IST)

ఆ టెస్ట్‌తో ఆత్మహత్యాయత్నాన్ని పసిగట్టేయవచ్చట!

జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ పరిశోధకులు సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. ఓ చిన్నపాటి పరీక్షతో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నాన్ని ముందుగానే పసిగట్టేయవచ్చని చెపుతున్నారు. అదీ కూడా ఓ సాధారణ రక్త పరీక్షతోనట. 
 
ఒత్తిడి - ప్రతిచర్యలకు సంబంధించిన ఓ జన్యువు (ఎస్కేఏ2)లో జరిగే రసాయన మార్పును ఈ పరిశోధకులు గుర్తించారు. ఈ జన్యువులో కలిగే మార్పులే మనిషిలో ఆత్మహత్యకు ప్రేరేపించే ఆలోచనలకు ముఖ్య కారణమవుతాయట. 
 
శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల్లో భాగంగా ఎస్కేఏ2లో చోటుచేసుకున్న జన్యు ఉత్పరివర్తనంపై దృష్టి సారించారు. దీంతో, పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తుల మెదళ్ళలో లభ్యమైన శాంపిల్స్‌తో, ఈ ఎస్కేఏ2 జన్యువులో లభ్యమైన శాంపిళ్ళు సరిపోలాయట. 
 
ఇక, రక్త పరీక్ష ద్వారా ఈ జన్యువు తీరును గుర్తించవచ్చని, తద్వారా మనిషిలో ఆత్మహత్య ఆలోచనను నివారించేందుకు వీలుంటుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జకర్యా కామిన్ స్కీ తెలిపారు.