చెన్నై అపోలో చిన్నపిల్లల ఆస్పత్రి సరికొత్త రికార్డు

చెన్నై మహానగరంలో ఉన్న అపోలో గ్రూపునకు చెందిన చిన్న పిల్ల చెన్నై అపోలో ఆస్పత్రి సరికొత్త రికార్డును సృష్టించింది.

apollo child hospital
pnr| Last Updated: మంగళవారం, 5 డిశెంబరు 2017 (11:34 IST)
చెన్నై మహానగరంలో ఉన్న అపోలో గ్రూపునకు చెందిన చిన్న పిల్ల చెన్నై అపోలో ఆస్పత్రి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఆస్పత్రి నెలకొల్పిన ఏడేళ్ళలో రికార్డు స్థాయిలో 50 వేల మంది చిన్నారులకు విజయవంతంగా హృదయం, కాలేయం, ఇతర అవయవాల ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసింది.
 
ఈ సందర్భంగా చెన్నైలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ ఆనంద్‌ కఖర్‌ మాట్లాడుతూ ఒమన్‌ దేశానికి చెందిన 9నెలల బాలుడికి కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో అతడి తండ్రి దానం చేసిన కాలేయ భాగంతో శస్త్రచికిత్స చేశామని చెప్పారు. ఇక తమిళనాడు రాష్ట్రానికి చెందిన గోపీనాథ్‌(7)ను అతడి తండ్రి, బామ్మ చేసిన అవయవాల దానంతో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసి కాపాడామన్నారు. అలాగే, గుజరాత్‌కు చెందిన ఓ పాపకు తల్లి అవయవదానంతో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు.
apollo child hospital
 
ఇలా 2010 నుంచి ఇప్పటివరకూ అపోలో ఆస్పత్రిలో 50మంది బాలబాలికలకు కాలేయ తదితర అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేశామని ఆయన వివరించారు. ఆపరేషన్లలో సహకరించిన వైద్య బృందాన్ని అపోలో ఆస్పత్రుల మేనేజింగ్‌ డైరెక్టర్‌ సునీతారెడ్డి అభినందించారు. కార్యక్రమంలో వైద్యులు ఆనంద్‌ రామమూర్తి, మనీష్‌ వర్మ, మహేశ్‌ గోపిశెట్టి, విశ్వనాథన్‌, వసంతా రూపన్‌ తదితరులు పాల్గొన్నారు.


దీనిపై మరింత చదవండి :