శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 మే 2015 (17:33 IST)

యాక్సిడెంట్లకు దారదే.. డ్రైవింగ్‌లో స్మార్ట్ ఫోన్స్ వాడకం.. తేల్చిన సర్వే

యాక్సిడెంట్లకు దారేదంటే... ఈజీగా డ్రైవింగ్‌లో ఫోన్స్ యూజ్ చేయడమే అంటున్నారు పరిశోధకులు డ్రైవింగ్ చేయడమంటే ఈ ట్రెండ్‌లో ఎవరికీ భయం లేకుండా పోతుంది. నైపుణ్యంతో చేసే డ్రైవింగ్ ప్రస్తుతం ఫోన్ వ్యసనంతో ప్రమాదాలకు దారితీస్తోంది. స్మార్ట్ ఫోన్‌లు జీవితంలో ప్రధాన భాగం అయిపోతున్నాయి. దీంతో డ్రైవింగ్‌లో కూడా స్మార్ట్ ఫోన్ వినియోగించకుండా ఉండలేకపోతున్నారు.
 
డ్రైవింగ్ చేసే విధానంపై అమెరికాలోని మల్టీ నేషనల్ టెలీ కమ్యూనికేషన్ కార్పొరేషన్ అనే సంస్థ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో 70శాతం మంది వాహనదారులు వాహనం నడిపే సమయంలో స్మార్ట్ ఫోన్లో సంభాషణలు జరుపుతూనే డ్రైవింగ్ చేస్తున్నారని తేలింది. దీంతో ప్రమాదాల బారిన పడుతున్నారని ఆ అధ్యయనం స్పష్టం చేసింది.
 
ఫోన్ వ్యసనంగా మారిపోయిన వీరు, కేవలం ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకోవడంతోనే ఆగకుండా, డ్రైవ్ చేస్తూ సెల్ఫీలు కూడా దిగుతున్నారు. కొన్ని సార్లు ఇంటర్నెట్ కూడా వాడుతున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. 61 శాతంమంది డ్రైవింగ్‌లో టెక్స్ట్ మెసేజ్‌లు టైప్ చేస్తుండగా, 33 శాతం మంది మెయిల్స్ చెక్ చేసుకుంటున్నారట.

27 శాతం మంది ఫేస్ బుక్, 14 శాతం మంది ట్విట్టర్, 14 శాతం మంది ఇన్ స్టాగ్రమ్, 11 శాతం మంది స్నాప్ చాట్ చేస్తున్నారట. వీరిలో 17 శాతం మంది సెల్ఫీలు తీసుకుంటున్నారట. మరో పది శాతం మంది వీడియో కాలింగ్ డ్రైవింగ్‌లోనే చేస్తున్నారట. ఇవన్నీ యాక్సిడెంట్లకు దారితీస్తున్నాయని అధ్యయనకారులు అంటున్నారు.