Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిద్ర తగ్గితే మోకాలి నొప్పులు ఖాయం...

శనివారం, 30 సెప్టెంబరు 2017 (19:21 IST)

Widgets Magazine
sleep

నిద్రకు మోకాలి నొప్పులకు సంబంధం వుందంటున్నాయి పరిశోధనలు. నిద్ర తగ్గితే మోకాలి నొప్పులు ఎక్కువవుతాయని చెపుతున్నాయి. మనం మేల్కొని వున్నప్పుడు మోకాలి దగ్గర ఎక్కువ కణజాలం చేరుతుంటుందట. నిద్ర సమయంలో ఉత్పత్తయ్యే కొన్ని హార్మోన్లు వాటిని కరిగిస్తాయి. నిద్రలేమి వల్ల ఆ అవకాశం లేకుండా పోతుంది. 
 
ఎక్కువగా బరువులు ఎత్తడం, ఆ ఎత్తే సమయం ఎక్కువగా వుండటం కూడా మోకాలి నొప్పులకు దారి తీస్తుంది. చేతులపై పడే భారం మోకాలికి పాకి లోపలి కీళ్లూ, ఎముకలు కిందకు జారడం ఇందుకు కారణం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మహిళల్లో ఆర్థ్రరైటిస్ వచ్చే ఆస్కారం ఎక్కువ. కదలికలకు అనుగుణంగా మోకాళ్లు వంగుతాయి. అధిక బరువు వున్నట్లయితే దాని భారం మోకాళ్ల మీద పడుతుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం శరీర బరువు మోకాలిలోని జాయింట్లపై పడి ఎక్కువ ఒత్తిడిని కలుగజేస్తుంది. 
 
వ్యాయామాలు మరీ ఎక్కువ చేయడం వల్ల మోకాలి సమస్యలు వస్తాయనడం నిజమే. కానీ అస్సలు కసరత్తుల జోలికి వెళ్లని వారిలో కూడా ఇది ఎక్కువగా వుంటుంది. బరువులెత్తే వ్యాయామాలు కాకుండా మోకాలిపై ఎక్కువ ఒత్తిడివ్వని యోగా, నడక, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలను ఎంచుకోవచ్చు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే... ఎత్తు మడమల చెప్పులు వేసుకునేవారిలో దీర్ఘకాలిక మోకాళ్ల నొప్పులు వస్తాయని. ఇది కూడా ఆస్టియో పోరాసిస్‌కి దారితీస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మెడ భుజాలకు వ్యాయామం.. ఆకర్ణ ధనురాసనం

సాధారణంగా ఆఫీసుల్లో పని చేసేవారు కొన్ని గంటలపాటు ఒకే స్థితిలో కూర్చుని పని చేస్తుంటారు. ...

news

ప్లాస్టిక్ బాక్స్‌లలో ఆహారం తింటే...

ఇపుడు ప్లాస్టిక్స్ బాక్స్‌లలో ఆహారాన్ని తీసుకెళ్ళడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఈ బాక్సుల్లో ...

news

నేరేడు ఆకులు, పండ్లు, బెరడు ఎలా ఉపయోగపడతాయో తెలుసా?

వర్షాకాలం వస్తుందంటే నేరేడు చెట్టు కూడా మెల్లగా పూత పూసి కాయలు కాస్తుంటుంది. నేరేడు కాయలు ...

news

లవంగాలతో వీర్యకణాల వృద్ధి

తేనె, కొన్ని చుక్కల లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి మూడుసార్లు తాగితే జలుబు ...

Widgets Magazine