శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 అక్టోబరు 2016 (14:59 IST)

రోడ్ సైడ్ ఆయిల్ ఫుడ్స్ తింటున్నారా? పేపర్లో పార్శిల్స్ వద్దే వద్దు... యమా డేంజర్..

రోడ్ సైడ్ ఆయిల్ ఫుడ్స్ వద్దే వద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోడ్ సైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా దుమ్ము ధూళిని మనమే సాదరంగా ఆహ్వానించి... కడుపులో నింపుకున్నట్లవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. రోడ్ సైడ

రోడ్ సైడ్ ఆయిల్ ఫుడ్స్ వద్దే వద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోడ్ సైడ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా దుమ్ము ధూళిని మనమే సాదరంగా ఆహ్వానించి... కడుపులో నింపుకున్నట్లవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. రోడ్ సైడ్ స్నాక్స్‌ను పార్శిల్స్ ద్వారా పేపర్‌లో చుట్టుకెళ్లి తినడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పేపర్లో స్నాక్స్ తీసుకెళ్లడం.. చేస్తే రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని వారు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
న్యూస్ పేపర్‌పై ఉండే గ్రాఫైట్ మీ శరీరంలోకి వెళ్లి లేని అనారోగ్యాన్ని కలగజేసే ప్రమాదముందని, పేపర్ ప్రింట్‌కు ఉపయోగించే ఇంకులో గ్రాఫైట్‌ను ఉపయోగిస్తారు. పత్రిక పొడిగా ఉన్నంతసేపు దానితో ప్రమాదమేమి ఉండదని వారు చెప్తున్నారు. ఎప్పుడైతే పత్రిక తడి బారిన పడుతుందో.. అందులోని గ్రాఫైట్ ప్రమాదకరంగా మారుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందుకే ఇళ్లల్లో ఏవైనా ఆయిల్ ఫుడ్స్ చేసినప్పుడు.. వాటినుంచి నూనె పీల్చివేయడానికి న్యూస్ పేపర్స్‌ను ఉపయోగించడం మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
గ్రాఫైట్ శరీరంలోకి చేరిపోయి ఏకంగా కిడ్నీలు, కాలేయం చెడిపోయే ప్రమాదం ఉంది. గ్రాఫైట్ ఎంత ప్రమాదకరమంటే.. కణాలు, ఎముకల ఎదుగుదలను నిరోధిస్తుంది. గ్రాఫైట్ శరీరంలో అలానే పేరుకుపోతాయని.. తద్వారా తీవ్ర అనారోగ్యం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.