శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2015 (16:19 IST)

తెలంగాణలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కేసులు.. ఇప్పటికే 7 కేసులు నమోదు

స్వైన్‌ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. దీంతో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్‌ సునిల్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి రాగా, అతన్ని పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. దీంతో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 7గా నమోదైంది. 
 
ఆగస్టులో మొత్తం ఏడు కేసులు నమోదైన క్రమంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిస్థితి గతేడాదిలా ఆందోళనకరంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చడిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం గతేడాది 75 కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 మంది మృతి చెందారు. తర్వాత 2015లో చలికాలంలో (జనవరి నుంచి మార్చి వరకూ) మొత్తం 2175 కేసులు నమోదయ్యాయి. ఇందులో 79 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కల చెప్తున్నాయి. కానీ, మృతుల సంఖ్య ఇంకా ఎక్కువేనని అనధికార సమాచారం.