శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (12:26 IST)

కు.ని ఆపరేషన్‌కు వెళ్తే... వృషణం తీసేశారు.. రూ.2.5 కోట్ల నష్టపరిహారం

అమెరికాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (వెసక్టమీ) చేయించుకునేందుకు ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఆపరేషన్ చేసే క్రమంలో వైద్యులు.. ఒక వృషణానికి రక్తం సరఫరా చేసే రక్త నాళాలను కత్తిరించారు. దీంతో ఒక వృషణాన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
ఈ వ్యవహారంపై బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు ఇటీవల విచారణకు రావడంతో జడ్జి కేసును పరిశీలించి సదరు హాస్పిటల్‌ను దోషిగా తేల్చారు. యూకాన్‌ హాస్పిటల్‌ ఆ వ్యక్తికి దాదాపు 2.5 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. కాగా, ఈ కేసు 2013లో ఫార్మింగ్టన్‌లోని యూకాన్ హెల్త్ సెంటర్‌లో జరుగింది.