యోగా డేంజరట.. పరిశోధన

గురువారం, 29 జూన్ 2017 (13:05 IST)

smita-yoga

ప్రపంచ యోగాదినోత్సవం ఇటీవలే ముగిసింది. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో తోడ్పడుతుందని యోగసాధకులు చెప్తుంటారు. కానీ యోగా శారీరక, మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుందన్న నమ్మకం నూటికి నూరు పాళ్లూ నిజం కాకపోవచ్చని ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు బాడీ వర్క్ అండ్ మూవ్ మెంట్ ధెరపీస్ జర్నల్‌లో ఒక కథనం వెలువడింది. 
 
యోగాకు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తున్న తరుణంలో యోగాపై బాడీ వర్క్ అండ్ మూవ్ మెంట్ ధెరపీస్ జర్నల్‌లో విడుదలైన కథనంలో యోగాతో కండరాల నొప్పులు ఎక్కువని ఉంది. కండరాలు, ఎముకల నొప్పులకు యోగా కారణమవుతోందని పరిశోధకులు చెప్తున్నారు. 
 
ఇప్పటికే ఉన్న గాయాలను యోగా మరింత పెద్దగా చేస్తోందని పరిశోధకులు ఆరోపిస్తున్నారు. యోగా చేసేవారిలో ఒళ్లు నొప్పులతో బాధపడేవారి సంఖ్య ఏటా పది శాతానికి పైగానే ఉంటోందనే విషయం తమ అధ్యయనంలో తేలిందన్నారు. ఫలితంగా యోగాసాధనతో రుగ్మతలను అధిగమించవచ్చునని నూటికి నూరుపాళ్లు నిజం కాకపోవచ్చని సిడ్నీ వర్శిటీ పరిశోధకులు చెప్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

తిన్న వెంటనే ఇది చేస్తున్నారా.. ఇక మీ పని అంతే..!

మనం చేసే పనులలో బాగా ఇష్టపడి చేసే పని భోజనం చేయడం. మనం ఎంత కష్టపడినా సరైన భోజనం చేస్తే ...

news

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. రోజూ ఓ కప్పు చేపలు తినాల్సిందే

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే.. చేపలు తినాల్సిందే. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ...

news

అమృతం అంటే నిమ్మకాయ..!

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా మనం చేయగలం. మన వంటింట్లో లభించే ఆహార ...

news

స్మార్ట్ ఫోన్లతో ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుందట..

ఉచిత డేటా పుణ్యంతో ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌ల వినియోగం విపరీతంగా ...