శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2015 (14:01 IST)

అది 'సెక్స్‌'కు దివ్యమైన సమయం... ఇటాలియన్ పరిశోధకుల వెల్లడి

సాధారణంగా భార్యాభర్తలు లేదా స్త్రీపురుషులు శారీరకంగా కలిసివుండేందుకు వీలుపడే సమయం రాత్రి. కానీ, ఇటాలియన్ పరిశోధకులు మాత్రం మరోలా చెపుతున్నారు. సెక్స్‌లో పాల్గొనే సమయం రాత్రి కాదనీ.. ప్రతి రోజూ తెల్లవారుజామున 5.48 గంటలు దివ్యమైన ముహుర్తమని పేర్కొంటూ దీనికిగల కారణాలను కూడా వెల్లడించారు. 
 
సాధారణంగా శృంగారంలో పాల్గొనే స్త్రీపురుషుల్లో లైంగికవాంఛను కల్పించే టెస్టోస్టిరాన్ స్థాయి.. రాత్రి వేళల్లో కంటే తెల్లవారుజామున అధికంగా ఉంటుందట. అందువల్ల తెల్లవారుజాము సమయమే శృంగారానికి మంచి సమయమట. మరీ ముఖ్యంగా తెల్లవారుజామున 5.48 గంటలు శృంగారానికి దివ్యమైన ముహూర్తమని వారు చెపుతున్నరు. 
 
తెల్లవారుజాము సమయాల్లో టెస్టొస్టిరాన్‌ స్థాయిలు అధికంగా ఉండటమేకాకుండా స్త్రీపురుషుల్లో ఎనర్జీ లెవల్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే వివిధ ఆలోచనలు, ఒత్తిడిల నుంచి దూరంగా ఉండేది కూడా ఆసమయంలోనే. కాబట్టి సెక్స్‌కు అదే మంచి సమయమని గెరాల్డిన్‌ మైర్స్‌ అనే సెక్స్‌ థెరపిస్ట్‌ అభిప్రాయపడ్డారు. 
 
ఈ సమయంలోనే స్త్రీ, పురుషుల్లో టెస్టొస్టిరాన్‌ స్థాయిలు అధికంగా ఉండటమే కాకుండా, శృంగారానికి దూరంగా ఉండే చాలా మంది పురుషుల్లో ఆ సమయాల్లోనే అంగస్తంభనలు జరిగి వీర్య స్ఖలనం జరుగుతుందని ఇటాలియన్‌ పరిశోధకులు వెల్లడించారు. ఈ సర్వే బ్రిటీష్ మెడికల్ జర్నల్‌ ప్రచురించింది.