శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : మంగళవారం, 24 మార్చి 2015 (14:55 IST)

ఉద్యోగస్తులకు వేకువ జాము సెక్సే థ్రిల్ కలిగిస్తుందట!

పరుగులమయ జీవితంలో భార్యాభర్తలు ఉద్యోగస్తులై ఉంటారు. దీంతో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఉరుకుపరుగులతో కూడిన జీవితాన్ని అనుభవిస్తుంటారు. 
 
ఉద్యోగానికి వెళ్లే భార్యాభర్తలు తమ పనుల్లో అలసిపోయి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాక వంట చేసుకుని ఆరగించి హాయిగా నిద్రపోతారు. అలా అలసిన శరీరాలు రాత్రివేళ సెక్స్ చేసుకునేందుకు పెద్దగా సహకరించవు. దీంతో దంపతుల్లో సెక్స్ సుఖం లేకుండా పోతుంది. అలాంటి వారికి డాక్టర్లు మంచి సలహా ఇస్తున్నారు. 
 
ఉద్యోగాలు చేసే దంపతులు రాత్రి వేళలో కాకుండా తెల్లవారు జామున సెక్స్ గురించి ఆలోచన చేస్తే మంచిదని చెపుతున్నారు. పగలంతా అలసిన శరీరాలు వేకువజాముకల్లా అలసట పోయి, ఫ్రెష్‌గా ఉంటుందని, పైపెచ్చు.. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుందని చెపుతున్నారు. 
 
ఈ సమయంలో సెక్స్ చేస్తే వ్యాయామానికి వ్యాయామం, సుఖానికి సుఖం దక్కుతుందని వారు చెపుతున్నారు. అందుకే ఈ సమయంలో సెక్స్ చేసి.. ఆ తర్వాత ఒక గంట పాటు నిద్రపోయి లేచి స్నానం చేస్తే శరీరం ప్రెష్‌గా ఉంటుందని అందులో ఉండే మజానే వేరని సూచిస్తున్నారు.