శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : శుక్రవారం, 24 జులై 2015 (20:20 IST)

నా గర్ల్‌ఫ్రెండ్ చాలా అందగత్తె.. సెక్స్‌లో కూడా తనుచెప్పినట్టే చేయాలంటోంది.. ఎలా?

నా గర్ల్‌ఫ్రెండ్ చాలా అందగత్తె. దీంతో అన్నివేళలా తనమాటే నెగ్గాలని తాపత్రయపడుతుంది. అలాగే, పడక గదిలో కూడా తనుచెప్పినట్టే సెక్స్ చేయాలని ఒత్తిడి చేస్తోంది. ముఖ్యంగా ఆమె కోరుకున్న భంగిమల్లోనే శృంగారంలో పాల్గొనాలని ఆర్డర్ వేస్తుంది. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నాతో పోట్లాటకు దిగుతుంది. ఏం చేయాలో అర్థంకావడం లేదు. సలహా ఇవ్వండి.
 
ఇలాంటి సమస్య చాలా మంది భర్తలకు ఎదురవుతుంది. దీనికి కారణం ఆమె అందానికి పడిపోయి.. ఆదిలోనే ఆమెకు లొంగిపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుంది. దీన్ని ఆమె తనకు అనుకూలంగా మార్చుకుని మిమ్మలను చులకనగా చూడటం ప్రారంభించింది. ఫలితంగానే పడక గదిలో ఆమె ఆర్డర్లు వేసే పరిస్థితి ఉత్పన్నమైంది. 
 
అయితే దాంపత్య జీవితంలో భార్య పెత్తనం చెలాయించినా లేక భర్త ఆధిపత్యం చెలాయించినా సంసార జీవితంలో చిక్కులు తప్పవు. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఏ మేరకు ఏ బాధ్యత నిర్వహించాలనేది స్త్రీపురుషులిద్దరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భావన ఉండరాదు.