శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 2 అక్టోబరు 2014 (16:31 IST)

గర్ల్ ఫ్రెండ్ భూత కాలం.. భార్య భవిష్యత్ కాలం.. ఏది కావాలో మీరే ఎంచుకోండి!

మాది బెంగుళూరు. ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నా. వివాహానికి ముందు నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమెతో అనేక సార్లు శారీరకంగా కలిశాను. ఆ సమయంలో ఎంతో సంతృప్తిని పొందడమే కాకుండా, ఆనందాన్ని పొందేవాడిని. వివాహమైన తర్వాత గర్ల్‌ ఫ్రెండ్‌తో సెక్స్‌లో పాల్గొనడం మానేశాను. అయితే, నా భార్యతో సెక్స్‌ చేస్తే గర్ల్ ఫ్రెండ్‌తో పొందినటువంటి ఆనందాన్ని సంతృప్తిని పొందలేక పోతున్నా. భార్యతో అంగ ప్రవేశం చేశాక ఆమె మాత్రం భావప్రాప్తి పొందుతూ సంతృప్తి చెందుతోంది. ఆ తర్వాత నాకు సహకరించడం లేదు. దీంతో నాకు మాత్రం తృప్తి కలగడం లేదు. ఫలితంగా నా పాత గర్ల్ ఫ్రెండ్‌తో మళ్లీ సెక్స్‌లో పాల్గొనాలని వుంది. ఏ చేయమంటారు? నా భార్యతో సెక్స్ సంతృప్తి పొందడమెలా? సలహా ఇవ్వండి. 
 
ఇక్కడో విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీ శృంగార తృప్తిని ఇద్దరు స్త్రీలతో పోల్చి చూస్తున్నారు. ప్రాథమికంగా ఇలా పోల్చడం సరికాదు. పైపెచ్చు.. ఇది మీ భార్యను మోసం చేయడమే. ప్రతి మనిషిలోనూ మంచి, చెడు గుణాలు ఉంటాయి. వాటిలో చెడు లక్షణాలను తొలగించి.. మంచిగా జీవించేందుకు ప్రయత్నించాలి. ఇక్కడ కూడా అంతే. కట్టుకున్న భార్యతో పడక సుఖాన్ని అనుభవించేందుకు ప్రయత్నించాలి. ఆమె ద్వారా ఎలా సెక్స్ సుఖం పొందాలో ఆలోచన చేయాలి. వాటికి అనుగుణంగా మీ భార్యను మార్చుకుని శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలే గానీ, పాత గర్ల్ ఫ్రెండ్ సుఖం కోసం మళ్లీ వెంపర్లాడటం తగదు. 
 
పైపెచ్చు.. భావప్రాప్తి పొందే సమయంలో ప్రతి మహిళలోనూ తేడా ఉంటుంది. కొందరు ఒక నిమిషానికే భావప్రాప్తి పొందితే.. మరికొందరు ఎక్కువ సమయం తీసుకుంటారు. అందువల్ల మీ భార్య భావప్రాప్తి పొందే సమయంపై దృష్టి సారించకుండా మీరు భావప్రాప్తి పొందేంత వరకు స్ట్రోక్స్ ఇవ్వండి. స్త్రీ భావప్రాప్తి పొందిన తర్వాత కూడా సెక్స్‌లో పాల్గొనే శక్తియుక్తులు ఉంటాయి. పైపెచ్చు... గర్ల్ ఫ్రెండ్ భూత కాలం.. భార్య భవిష్యత్ కాలం వంటిది. వీటిలో ఏది కావాలో మీరే ఎంచుకోండి.