శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PY REDDY
Last Updated : సోమవారం, 29 డిశెంబరు 2014 (19:22 IST)

యోనిలోంచి వీర్యం బయటకు వచ్చేస్తోంది.. పిల్లలు పుడతారా..

నా వయసు 26 యేళ్ళు. నాకు పెళ్ళయింది. చాలా హాపీ ఉన్నాం. అయితే సెక్సులో పాల్గొన్న తరువాత నా అంగంలోంచి విడుదలైన వీర్యం అంతా నా భార్య యోనిలోంచి బయటకు వచ్చేస్తోంది. అలా జరుగితే గర్భం వస్తుందా? పిల్లలు పుట్టరేమో..! వీర్యం బయటకు రాకుండా ఆపడం ఎలా ? సమస్యకు పరిష్కారం చెప్పరూ..
 

అపోహలు వద్దు.. అలాగని అనుమానాలు నివృత్తి చేసుకోకుండా ఉండవద్దు... చాలా మందికి వచ్చే అనుమానమే మీకు వచ్చింది. పెళ్లయిన 20 యేళ్ళ తరువాత సెక్సులో పాల్గొన్నా ఇలాంటి సంఘటనలు చాలా మంది సెక్సు జీవితంలో జరగుతుంటాయి. పురుషుడి వీర్యంలో కొన్ని కోట్ల వీర్యకణాలు ఉంటాయి. తోకతో ఉన్న ఆ వీర్యకణాలు వీర్య ఈదుతూ, చాలా వేగంగా కదులుతుంటాయి. ఇవన్నీ ఒకే శక్తిని కలిగి ఉంటాయి. వీర్యం యోనిలోంచి బయటకు వచ్చేసిందని ఆందోళన చెందాల్సిన పనిలేదు. అలా బయటకు రావడం ఇష్టం లేకపోతే, భాగస్వామి నడుము కింద దిండులాంటిది పెట్టి సంభోగించండి వీర్యం బయటకు రావడం తగ్గుతుంది. 
 
ఇక గర్భం అంటారా.. అది ఫలధీకరణం చెందిన అండాలను అనుసరించి ఉంటుంది. నిర్ణీత సమయంలో సంభోగంలో పాల్గొంటేనే గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీ భాగస్వామి డిసెంబర్ 1 నెలసరి అవుతుందని ఉదాహరణకు అనుకోండి. ఐదు రోజుల తరువాత సాధారణంగా సెక్సుకు సిద్ధమవుతారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే డిసెంబరు 13 నుంచి 17 వరకూ అండాలు ఫలదీకరణకు సిద్ధమవుతాయి. అండోత్సర్గం పెరుగుతుంది. అందుకే ఆ సమయంలో సంభోగాల సంఖ్య పెంచాలి. విడుదలైన అండాలు వీర్యకణాలతో కలసి గర్భం దాల్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అపోహలను పక్కన బెట్టి ఇతర ఆరోగ్య సమస్యల్లేకుండా చూసుకోండి. తృప్తిగా సంభోగంలో పాల్గొనండి.