శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : గురువారం, 17 జులై 2014 (17:11 IST)

ఆమె బ్లాక్ మెయిల్ చేస్తూ సెక్స్‌లో పాల్గొనేలా చేస్తోంది.. ఏం చేయాలి?

మాది విజయవాడ. ఓ ఆపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాం. ఇటీవల మాపక్క పోర్షన్‌లో ఒక కుటుంబం దిగింది. వారు మాతో త్వరగానే కలిసిపోయారు. ఒక రోజు నేను ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్నపుడు ఆమె ఏమీతోచడం లేదంటూ మా ఇంట్లోకి వచ్చి... ఆ కబుర్లూ.. ఈ కబుర్లూ చెపుతూ హఠాత్తుగా నన్ను కౌగిలించుకుంది. ఆమె నాకన్నా బలంగా ఉండటంతో ఆమెను వదిలించుకోలేకపోయాను. ఆ తర్వాత నన్ను సోఫాలోకి నెట్టేసి నాతో బలంగా సెక్స్ చేయించుకుంది. అప్పటి నుంచి ఈ విషయం నా భార్యకు చెపుతానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ అవకాశం చిక్కినపుడల్లా నాతో సెక్స్ చేయించుకుంటోంది. ఆమెను ఎలా వదిలించుకోవాలి. సలహా ఇవ్వండి. 
 
ఈ ప్రశ్నలో ఏమాత్రం వాస్తవరూపం కాదు. అసలు నమ్మశక్యంగా లేదు. వాస్తవానికి తొలిసారి సెక్స్‌లో పాల్గొన్న సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు గానీ.. ప్రతిసారీ.. బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ.. మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె మీతో సెక్స్ చేయించుకోలేదనే విషయాన్ని గ్రహించాలి. నిజంగా మిమ్మలను బ్లాక్‌మెయిల్ చేయాలని ఆమె భావిస్తే.. మీ ద్వారా సెక్స్ సుఖాన్నే పొందాలన్న నిర్బంధ లేదు. ఇలాంటి రహస్య సంబంధం కొనసాగిస్తూ ఆనందం పొందాలని అనుకుంటే కొనసాగించు.. వద్దనుకుంటే తెగతెంపులు చేసుకునేందుకు మరొకరు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన అక్కర్లేదనే విషయాన్ని గమనించగలరు.