శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By PNR
Last Updated : సోమవారం, 23 మార్చి 2015 (17:13 IST)

నా గర్ల్ ఫ్రెండ్ 2-3 రౌండ్లు చాలంటోంది.. కానీ నిగ్రహించుకోలేకపోతున్నా.. ఏం చేయాలి?

నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. మేమిద్దరం ఒకే కంపెనీలో పని చేస్తున్నాం. మా మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. వాస్తవానికి నాకు సెక్స్ కోర్కెలు ఎక్కువ. దీంతో నా గర్ల్ ఫ్రెండ్‌తో వీలుపడినపుడల్లా సెక్స్‌లో పాల్గొంటున్నా. అయితే, ఇక్కడ నా సమస్య ఏంటంటే.. రెండు మూడు రౌండ్ల తర్వాత కూడా సెక్స్‌లో పాల్గొనాలని ఉంటుంది. కానీ, నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం 2-3 రౌండ్ల కంటే ఎక్కువ వద్దని వారిస్తోంది. ఒక రోజున మేమిద్దరం నా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో సెక్స్ చేస్తుంటే ఆమె తల్లిదండ్రులు వచ్చారు. వెంటనే నన్ను తోసేసింది. దీంతో నాకు కోపం వచ్చి లెంపకాయపై లాగి ఒకటి ఇచ్చా. ఎందుకంటే.. అసలే కోర్కెలు ఎక్కువున్న నాకు.. మధ్యలో తోసివేయడంతో కంట్రోల్ చేసుకోలేక పోయా. అందుకే ఆ విధంగా ప్రవర్తించాను. ఇక్కడ నా సమస్య ఏంటంటే.. ఒకటి రెండు రౌండ్ల తర్వాత సెక్స్ కోర్కెలను నిగ్రహించుకోవడమెలా.? ఇప్పటికే అనేక టిప్స్ కూడా ప్రయత్నించి విఫలమయ్యాను. 
 
సాధారణంగా యుక్త వయస్సులో ఉండే యువకుల్లో సెక్స్ కోర్కెలు అమితంగా ఉంటాయి. ఫలితంగానే సెక్స్‌లో ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. మీ కోర్కెలకు అనుగుణంగా ఆ యువతి సహకరించడానికి కారణం మీ పరిస్థితిని అర్థం చేసుకోవడమే కారణం. అయితే, సెక్స్‌ చేస్తున్న సమయంలో తల్లిదండ్రులే కాదు ఎవరొచ్చిన యువతులు లేదా మహిళలు ఆ విధంగానే ప్రవర్తిస్తారు. అందుకే తోసేసింది. అలాంటి పరిస్థితుల్లో చేయి చేసుకోవడం భావ్యం కాదు. 
 
పైగా, గర్ల్ ఫ్రెండ్ లేదా మహిళ సెక్స్ యంత్రం కాదు. పురుషుని కోర్కెలకు అనుగుణంగా నడుచుకోవడం సాధ్యం కాదు. శృంగారానికి సమయం సందర్భమంటూ ఉంటాయి. యువతికి సమ్మతం లేకుండా సెక్స్ చేయడం అత్యాచారంతో సమానం. అందువల్ల మనస్సు నిగ్రహించుకునేందుకు యోగా వంటి సాధన చేయండి. లేదా సెక్స్ నిపుణుల సలహాలు తీసుకోండి. అంతేకానీ, ఈ తరహాగా ప్రవర్తించడం ఏమాత్రం భావ్యం కాదు.