శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By CVR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (16:53 IST)

ప్రతి రోజూ సెక్స్... ఊబకాయానికి చెక్

ప్రతి రోజూ సెక్స్ చేస్తే ఊబకాయం సమస్య నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ అనేది మనిషికి దివ్యఔషదం లాంటిది. సెక్స్‌లో ఎన్నో లాభాలు  ఉన్నాయని, సెక్స్‌తో మానసికోల్లాసమే కాకుండా, శరీరానికి మంచి వ్యాయామం కూడా అని నిణుపులు అంటున్నారు.

రోజూ వ్యాయామం చేయడానికి బద్దకించి లావుగా తయారయ్యిన వారు ప్రతి రోజూ సెక్స్‌లో  పాల్గొంటే సన్నబడటం ఖాయం అని తెల్చి చెబుతున్నారు. 
 
ముద్దు పెట్టుకోవడం వలన శరీరంలో ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయి? అవి లావు తగ్గడానికి ఏమేరకు సహకరిస్తాయని పరిశీలిస్తున్నప్పుడు పరిశోధకుల దృష్టి ఈ సెక్స్‌పై కూడా పడింది. ముద్దు పెట్టుకునే సమయంలో నిమిషానికి సగటున 2 నుంచి 5 కేలరీలు ఖర్చవుతున్నాయి.

మరీ ముఖ్యంగా శ్వాస ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ స్థాయిలో కేలరీలు ఖర్చవుతాయి అని సర్వే అభిప్రాయపడింది. 
 
అయితే, ఎక్కువ మోతాదులో వున్న లావు తగ్గడానికి ఈ మాత్రం కేలరీలు ఖర్చయితే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. అయితే, అసలు ముద్దుతో పోల్చుకుంటే.. ముద్దుకన్నా సెక్స్‌తోనే అధికమొత్తంలో కేలరీలు ఖర్చవుతాయని ఇంకొన్ని సర్వేలు చెబుతున్నాయి.
 
సెక్స్‌లో పాల్గొన్న మహిళల్లో నిమిషానికి 3.1 కేలరీలు ఖర్చవగా, పురుషుల్లో 4.2 కేలరీలు ఖర్చవుతాయని ఓ సర్వే పేర్కొంది. ఈ లెక్క ప్రకారం ఎంత ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే కేలరీలు ఖర్చు అవడానికి అంత ఎక్కువ అవకాశం వుంది. 
 
శరీరంలో కేలరీలు ఎంత ఎక్కువగా ఖర్చయితే లావు తగ్గవచ్చునని సర్వేద్వారా వెల్లైడంది. రోజూ సెక్స్ చేయండి ఉబకాయం సమస్య నుంచి బయటపడండి.