శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (17:35 IST)

నా భార్య గోవాలో బికినీతో తిరిగింది... వివాహేతర సంబంధం పెట్టుకుంటుందా...?

నా వయసు 29 ఏళ్లు. మేట్రిమొనియల్ సైట్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పలుమార్లు ఇద్దరం కలుసుకుని ఒకరి అభిప్రాయాలు ఒకరం తెలుసుకున్నాం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఐతే అప్పుడు ఆమె ఓ కండిషన్ వేసింది. తనకు ఫ్రీడమ్ ఇవ్వాలనీ, తన చేష్టలు, అభిప్రాయాలకు విలువివ్వాలని అంది. ఒప్పుకున్నాను. పెళ్లి చేసుకున్నాం. 5 నెలలు గడిచింది. ఈమధ్య హనీమూన్ వెళ్లాం. గోవా, కొడైకెనాల్, ఊటీ తదితర ప్రాంతాల్లో తిరిగాము. గోవా వెళ్లినపుడు ఆమె బాగా కురచగా ఉన్న బికినీ వేసుకుని అలాగే బీచ్ ఒడ్డున స్నానం చేయడం మొదలెట్టింది. 
 
ఆమె చాలా అందగత్తె, ఆమె అలా బికినీ వేసుకుని వెళ్లడంతో అవాక్కయ్యాను. ఆమె ఒక్కసారిగా దుస్తులు తీసేసి అలా బికినీలో సముద్రం ఒడ్డున ఉన్న సమయంలో కొంతమంది కుర్రాళ్లు కామెంట్లు చేశారు. వాటిని విని నేను తట్టుకోలేకపోయాను. కానీ నా భార్య మాత్రం వాటిని పట్టించుకున్నట్లు లేదు. బికినీలోనే దాదాపు గంటకు పైగా అక్కడే ఉంది. ఆ తర్వాత తిరిగి వచ్చేటపుడు డ్రెస్ సెన్స్ పై మాట్లాడితే నీకు ముందే చెప్పాను. నాకు ఫ్రీడమ్ కావాలని... అంటూ కోపంగా మాట్లాడింది. 
 
కుర్రాళ్లు అలా కామెంట్లు చేశారు కదా... అని అంటే, ఎవరో ఏదో అంటున్నారని నా ఇష్టాలను వదులుకోవాలా అని చెప్పేసి ఆ రోజంతా నాతో మాట్లాడలేదు. ఆమె వైఖరి చూస్తుంటే భవిష్యత్తులో స్వేచ్చ పేరుతో ఇష్టమైన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందేమోనని భయంగా ఉంది...
 
మీది అర్థంలేని భయం. ఆమె మీకు తన అభిప్రాయాలు, అలవాట్లు గురించి మీ పర్మిషన్ పెళ్లికి ముందే తీసుకున్నది. ఒకవేళ మీకు అభ్యంతరాలున్నట్లయితే పెళ్లికి ముందు ఫ్రీడమ్ వేటికి ఇవ్వాలని అడిగి ఉండాల్సింది. ఐతే ఇప్పుడు బీచ్ ఒడ్డున బికినీ వేసుకున్నది కాబట్టి భవిష్యత్తులో వివాహేతర సంబంధం పెట్టుకుంటుందని భయపడటం అర్థరహితం. మీకు ఇష్టం లేకున్నట్లయితే ఆమెకు మెల్లగా నచ్చజెప్పండి. పెళ్లికి ముందు మీ అనుమతులు అడిగిన యువతి, మీ మాటను ఎందుకు కాదంటుందీ...?