శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 18 సెప్టెంబరు 2014 (14:04 IST)

పొడవాటి పురుషాంగం ఉన్న మగాడితో సెక్స్ చేయించుకో అంటున్నాడట...

మేమిద్దరం ప్రాణ స్నేహితురాళ్లం. మా జీవితంలో జరిగే సంఘటనలను షేర్ చేసుకుంటుంటాం. ఈమధ్య నా స్నేహితురాలు ఓ విషయాన్ని నాతో చెప్పింది. అదేమిటంటే... ఆమె తన భర్తతో సెక్సులో పాల్గొనే ముందు పోర్న్ చిత్రాలు చూపాడట. ఆ తర్వాత అతడు ఆమెతో సెక్స్ చేస్తుంటాడట. ఆ సమయంలో నా స్నేహితురాలు పోర్న్ చిత్రాల్లో ఓ పురుషుడి యొక్క పురుషాంగం పొడవుగా ఉన్నట్లు నీది కూడా ఉంటే బావుండేది అన్నదట. 
 
ఇక అప్పట్నుంచి పొడవైన పురుషాంగం ఉన్న మగాడితో సెక్సులో పాల్గొని తృప్తి తీర్చుకోమంటున్నాడట. ఇందుకుగాను అతడు తన ఆఫీసులో పొడవైన పురుషాంగం ఉన్న మగాడిని చూసి అతడితో చేయించుకోమని సలహా ఇస్తున్నాడట. ఆ మాటతో నా స్నేహితురాలు షాక్ తిని విషయం నాతో చెప్పింది. ఐతే తన భర్త మాత్రం రోజూ ఒత్తిడి చేస్తున్నాడట. అతడలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు...?
 
పోర్న్ చిత్రాలు చూడటం కొందరిలో వ్యసనంగా మారుతుంది. వాటిని చూడకుండా సెక్స్ చేసేందుకు ఉపక్రమించరు. ఇలాంటివారే ఇలా ప్రవర్తిస్తుంటారు. నిజానికి పురుషాంగం పొట్టిది, పొడవైనది అనే దానికంటే ఎంత బాగా స్తంభించి ఉన్నదనేదే ముఖ్యం. స్త్రీ యోనిలో కామనాడులు కేవలం 2 నుంచి 3 అంగుళాల లోపే ఉంటాయి. కాబట్టి 4 అంగుళాలున్న స్తంభించిన పురుషాంగం స్త్రీని సెక్సులో తృప్తి పరిచేందుకు సరిపోతుంది. 
 
అంతకంటే ఎక్కువగా ఉంటే తృప్తి ఎక్కువగా ఉంటుందనేది అపోహ. ముఖ్యంగా సెక్స్ పరిజ్ఞానం తెలుసుకోవాలి కానీ... మరీ పోర్న్ చిత్రాలతోటిదే లోకం అన్నట్లు ఉండరాదు. తన భర్తతోనే సెక్స్ జీవితం హాయిగా ఉంటుందని ఆమెకు చెప్పండి. ఇదే విషయాన్ని అతడితోనూ చెప్పమనండి. అంతేగానీ... అతడు చెప్పినట్లు మరో మగాడితో సెక్సు సంబంధం పెట్టుకుంటే అది అందరి జీవితాలను నాశనం చేస్తుంది.