శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 అక్టోబరు 2014 (16:10 IST)

మనిద్దరం సెక్సులో పాల్గొని అనుభవంపై చర్చిద్దాం అన్నా... అంతే...

ఈమధ్య మా ఆఫీసులో ఓ యువతి కొత్తగా ఉద్యోగంలో చేరింది. మొదట్లో నాతో ఎంతో చనువుగా ఉంటూ వచ్చింది. ఒక దశలో ఆమె నాతో సెక్స్ సంభాషలు చేయడం మొదలుపెట్టింది. మొదట్లో ఇలాంటి సంభాషణలు తప్పు అనిపించినా ఆ తర్వాత నేను క్యాజువల్ గా ఉండేసరికి ఆమె సెక్సుకు సంబంధించి సందేహాలతో కూడిన సంభాషణ ఎక్కువగా చేయడం ప్రారంభించింది. 
 
ఒకరోజు మా ఇద్దరి మధ్య పురుషాంగం, యోని పనితీరు గురించిన చర్చ వచ్చింది. ఆ సమయంలో నేను ఉండబట్టలేక మన ఇద్దరం సెక్సులో పాల్గొంటే ఆ అనుభవం ఎలా ఉంటుందో చూస్తే దానిపై మాట్లాడుకోవచ్చు కదా అన్నాను. అంతే... ఇక అప్పట్నుంచి ఆమె నాతో మాట్లాడటం మానేసింది. పలుకరించినా తల అటు తిప్పుకుని వెళ్లిపోతోంది. కానీ ఆమెతో ప్రతిరోజూ సెక్స్ సంభాషణలు చేసిన నాకు ఆమె మాట్లాడకపోతే ఏదోగా ఉంటోంది. ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తోంది...?
 
సంభాషణల వరకైనా ఒక స్త్రీ పరాయి పురుషుడితో సెక్సుకు సంబంధించిన చర్చను చేయడం చాలా అరుదుగా ఉంటుంది. ఐతే మీ విషయాన్ని చూస్తుంటే ఆమె మిమ్ములను కేవలం ఓ స్నేహితుడిగానే భావించినట్లు అర్థమవుతోంది. కానీ మీరు ఆమె వద్ద నుంచి సెక్సు సుఖాన్ని కోరుకున్నారు. అది ఆమెకు కోపం తెప్పించి ఉంటుంది. అందువల్లనే మీతో మాట్లాడటం కానీ, పలుకరింపులు అన్నీ బంద్ అయిపోయాయి.