శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By Ivr
Last Modified: సోమవారం, 3 నవంబరు 2014 (17:36 IST)

నాలుగేళ్ల తర్వాత నా ప్రేయసి నుంచి మెయిల్... ఇద్దరం ఫారిన్ లోనే... సెక్సులో పాల్గొంటే....

నేను ప్రొఫెషనల్ కోర్సు చేసేటపుడు అందమైన అమ్మాయి స్నేహితురాలైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా నాలుగేళ్లు ప్రేమించుకున్నాం. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఇద్దరం సెక్స్ చేసుకోలేదు కానీ నేను ఆమెకు ఎన్నోసార్లు ఓరల్ సెక్స్ చేశాను. కానీ ఏమైందో తెలియదు కానీ... హఠాత్తుగా ఫోన్ సిమ్ మార్చేసింది. చేసే ఉద్యోగాన్ని మానేసింది. అసలు ఎక్కడికి వెళ్లారో తెలియదు. ఏడు నెలల తర్వాత ఆమె పెళ్లయిపోయిందని విన్నాను. చానాళ్లు మనసులో బాధతో మామూలు మనిషి కాలేకపోయాను. ఆ తర్వాత మా ఇంట్లో మా పేరెంట్స్ మరో అమ్మాయితో నాకు పెళ్లి చేశారు. 
 
ఇపుడు నేను ప్రమోషన్ పై ఫారిన్ లో ఉన్నాను. విచిత్రం ఏమిటంటే... ఇన్నాళ్లకు... నాలుగేళ్ల తర్వాత నా ప్రేయసి నాకు మెయిల్ పంపింది. అందులో తన తల్లిదండ్రులు ఒత్తిడి చేసి పెళ్లి చేశారనీ, ఐనా తను తన భర్తతో సంతోషంగానే ఉన్నట్లు రాసింది. ఇంకా నా ఫోన్ నెంబరు అడుగుతూ రిక్వెస్ట్ చేసింది. 
 
మెయిల్ లో ఆమె క్షేమ సమాచారాన్ని అడిగాను. ఒక అమ్మాయి పుట్టిందట. ఆమె కూడా ఫారిన్లోనే నేను ఉండే చోటుకు కాస్త దూరంగా ఉంటోంది. వీలు చూసుకుని ఒకసారి రమ్మని చెప్పింది. వెళ్లాను. ఆనాటి గుర్తులన్నీ చెప్పి మళ్లీ నాలో పాత జ్ఞాపకాలను రేపుతోంది. ఆమెను అంత సమీపంగా చూసి ఉండలేకపోతున్నాను. ఆమెతో సెక్స్ కావాలనిపిస్తోంది. అలా చేస్తే స్వదేశంలో ఉన్న నా భార్యకు తెలుస్తుందా..? నా ప్రేయసి నా కోర్కెను ఒప్పుకుంటుందా...?
 
ఆమె పెళ్లి చేసుకుని భర్త, కుమార్తెతో సంతోషంగా ఉన్నట్లు మీకు మెయిల్ లో తెలిపింది కదా. మీరు ఇన్నిమార్లు వెళ్లినా మీ వద్ద సెక్స్ ప్రస్తావన తేలేదు. మీరు కూడా ఆమెను మీ ప్రేయసిలా కాకుండా మంచి స్నేహితురాలిగా చూడటం మంచిది. గతంలో జరిగినవి జరిగిపోయాయి. ఇప్పుడు మీకు, ఆమెకు పెళ్లయి కుటుంబాలు వచ్చేశాయి. కాబట్టి ఇపుడు మీరు ఇద్దరూ ఎలాంటి చర్యకు పాల్పడినా అది మీ రెండు కుటుంబాలపై ప్రభావం చూపుతుంది. ఆమెతో సెక్స్ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేయండి.