శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 11 నవంబరు 2014 (17:58 IST)

పెళ్లైనా మాజీ ప్రేయసిని మర్చిపోలేకపోతున్నా... సెక్స్ కోసం వెళతానేమో...?

8 సంవత్సరాల క్రితం నేను ప్రేమించిన అమ్మాయితో చిన్న మనస్పర్థ కారణంగా విడిపోయాం. ఇద్దరం కోపంతో వేర్వేరు వివాహాలు చేసుకున్నాం. ఆమె ఎలా ఉందో తెలియదు కానీ పెళ్లయ్యాక నేను కూడా రెండుమూడేళ్లు బాగానే ఉన్నాను. ఐతే ఈమధ్య ప్రతి విషయంలోనూ ఆమె జ్ఞాపకాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. 
 
ముద్దులు, కౌగిళ్లు... ఇలా ఆమెతో గడిపిన తీపి జ్ఞాపకాలు వదలడంలేదు. ఆమెతో మళ్లీ మునుపటిలా ఉండాలనిపిస్తోంది. అంతేకాదు... సెక్స్ కూడా చేయాలనిపిస్తుంది. ఇది తప్పని తెలిసినా ఇలాంటి ఆలోచనలు నా బుర్రను తినేస్తున్నాయి. వీటిని వదిలించుకోవడమెలాగో తెలియడంలేదు...

 
పెద్దలు చెప్పినట్లు నిగ్రహమే ముఖ్యం. మీ ధ్యాసను మీ ఉద్యోగం ఉన్నతి కోసమో... మీ పిల్లల భవిష్యత్ పైనో పెట్టండి. ఆ దిశగా ఆలోచనలు సాగించండి. ఇంకా కెరీర్ పరంగా ఏమైనా అదనపు కోర్సులు చేయాల్సినవి మిగిలి ఉంటే వాటిపై ధ్యాస పెట్టండి. మీ మైండును పూర్తిగా ఇలాంటి పనులతో నింపేయండి.
 
ఇకపోతే తొలి ప్రేమ అనేది ప్రేమించినవారిని బతికినంత కాలం వదలదు. ఐనప్పటికీ విడిపోయారు కనుక వాటిని కూడా విడిచిపెట్టక తప్పదు. ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలియదంటున్నారు. ఆమె సంతోషంగా మరో పెళ్లి చేసుకుని ఉండి ఉండవచ్చు. మీరు మరోసారి ఆమె జీవితంలోకి ప్రవేశించి లేనిపోని సమస్యలకు కారణం కావద్దు.