శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: గురువారం, 22 జనవరి 2015 (14:50 IST)

అక్కా అంటూనే లైనేస్తున్నాడు... అక్క కూడా.... వాడిని పొమ్మనలేక...

నా స్నేహితుడికి స్నేహితుడు ఓ రోజు మా ఇంటికి వచ్చాడు. అతడు నాకంటే వయసులో ఓ రెండేళ్లు పెద్దవాడే. నాకు పీజీ చదువుతున్న అక్కయ్య ఉంది. ఆమెను నా స్నేహితుడి వెంట వచ్చినవాడు అదేపనిగా చూస్తున్నాడు. వాడి చూపుల్లో తేడా ఉంది. ఐతే మా అక్కయ్యతో ఎంతో ఆప్యాయత నటిస్తూ అక్కయ్య అని పిలుస్తున్నాడు. కానీ వాడి చూపుల్లో తేడాను గమనిస్తున్నాను. 

 
ఈమధ్య తరచూ వాడు మా స్నేహితుడు లేకుండానే వచ్చేస్తున్నాడు. మా అక్క అతడితో చనువుగానే ఉంటోంది. వస్తువులను కొనుక్కొచ్చి వాటిని ఇస్తూ ఆమెను ఎక్కడెక్కడో తాకుతున్నాడు. నాకు వళ్లు రగిలిపోతోంది. వాడిని రాకుండా చేయడమెలాగో తెలియడంలేదు. నేరుగా చెబితే మా అక్క హర్ట్ అవుతుందేమోనని అనుమానమూ ఉంది...
 
ఇలాంటివారు సమాజంలో అక్కడక్కడా ఉంటున్నారు. అక్క, చెల్లి, పిన్ని అంటూనే మహిళ పట్ల శృంగార చూపులు చూస్తుంటారు. కొందరు ఆ పేరుతో పిలుస్తూనే అమాయకంగా ఉన్నవారిని బుట్టలో పడవేసి వారి జీవితాన్ని నాశనం చేస్తుంటారు. ఇటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముందుగా మీ స్నేహితుడి ద్వారా హెచ్చరికలు పంపండి. అతడి ప్రవర్తన సరిగా లేదని చెప్పి తక్షణం ఇంటికి రావద్దని చెప్పేయండి. పెద్దవాళ్లు చెప్పినట్లు అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మంచిది.