శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: సోమవారం, 11 మే 2015 (16:27 IST)

పబ్ పార్టీలో అనుకోకుండా సెక్సులో పాల్గొన్నా... ఆ అనుభవంతో చితికిపోతున్నా...

నా స్నేహితురాలు పబ్ పార్టీకి పిలిస్తే వెళ్లాను. మొదట్లో చాలా సిగ్గుగా అనిపించినా అక్కడ చాలామంది ఫ్రెండ్స్‌ను ఉండటాన్ని చూశాను. మొదట్లో కొద్దిగా బెరుకుగా ఉన్నా.... ఆ తర్వాత్తర్వాత అక్కడి వాతావరణానికి ట్యూన్ అయ్యాను. ఐతే ఇటీవల ఆ పార్టీలో అనుకోకుండా ఓ అబ్బాయితో సెక్సులో పాల్గొన్నాను. ఆ తర్వాత ఆ సెక్స్ అనుభవాన్ని తలచుకుని కుంగిపోతున్నాను. నాకు నిద్రపట్టడంలేదు. 

 
యువతరం పార్టీలకు వెళ్లడం పెరిగింది. పార్టీల్లో ఉత్సాహం, వయసు చేసే అల్లరి ఎదురుగా కనిపించే ఆకర్షణ అందాలు అన్నీ కలిపి మనసును సెక్సు వైపుకు మళ్లిస్తుంటాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపునే లైంగిక ఆనందంలో మునిగిపోతారు. ఐతే లైంగిక సంబంధానికి మనసు సిద్ధంగా లేకపోయినా అక్కడి వాతావరణం వత్తిడి వల్ల బలవంతంగానే కొందరు సెక్సులో పాల్గొనే పరిస్థితి వస్తుంది. అప్పుడు సెక్స్ సుఖం చవిచూశాక మనసులో తలెత్తే అలజడి అంతాఇంతా కాదు. 
 
తప్పు చేశానన్న భావన. గర్భం వస్తుందేమోనన్న భయం. ఏమైనా ఇన్ఫెక్షన్ సోకుతుందేమోనన్న సందేహం, అన్నీ కలిపి మానసికంగా కుంగిపోవడం జరుగుతుంది. అందువల్ల పార్టీలకు వెళ్లేముందు గట్టిగా ఓ నిర్ణయాన్ని అనుకుని వెళ్లాలి. అక్కడ వాతావరణం మనసును అల్లకల్లోలం చేస్తున్నా... మనసులో గూడుకట్టుకున్న దృఢసంకల్పంతో అటువైపు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. మీ విషయంలో అనుకోకుండా జరిగిపోయిన తప్పుకు మళ్లీ ఆలోచించి మనసు పాడుచేసుకోవడం అనవసరం. అదో పీడకలగా మర్చిపోయి కొత్త జీవితాన్ని గడపేందుకు ప్రయత్నించండి.