శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: బుధవారం, 1 జులై 2015 (15:52 IST)

కామసూత్ర పుస్తకం తెచ్చి ఆ భంగిమల్లో సెక్స్ చేద్దామంటోంది.. ఆమెపై సందేహంగా ఉంది...

నా భార్య ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. శోభనం రోజున మాటల మధ్యలో ఓ ప్యాకెట్ బయటకు తీసింది. అందులో ఉన్న పుస్తకాన్ని తీసి నా చేతిలో పెట్టింది. ఆ పుస్తకంలో ఉన్న భంగిమలను చూస్తూ చాలా ఎక్జయిట్ అయ్యింది. అలాంటి భంగిమల్లో సెక్స్ కావాలని అడుగుతోంది. ప్రతి రోజూ కొత్త భంగిమలో చేయమని అడుగుతోంది. ఇలా ఎందుకు కోరుతుందో అర్థం కావడం లేదు. పెళ్లికి ముందే ఆమెకు సెక్స్‌లో అనుభవం ఉందా అనే సందేహం కలగడమే కాకుండా, నేను ఆమెను సంతృప్తిపరచలేక పోతున్నానేమోనని అనుమానం కూడా వస్తోంది. నా అనుమానం ఎంతవరకు నిజమో తెలియడంలేదు...
 
మీవి అర్థంలేని అనుమానాలు. మీరు సంతృప్తిపరచకుంటే ఆమె మిమ్మల్ని ప్రతిరోజూ ఓ కొత్త భంగిమలో సెక్స్ చేయమని కోరదు. రోజుకో కొత్త భంగిమలో సెక్స్ చేసుకోలనుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పటి అమ్మాయిలు సెక్స్ పరిజ్ఞానాన్ని అబ్బాయిలతో సమంగానే తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఆమె అడుగుతుందంటే ముందే అనుభవం ఉందని అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. ఇకపోతే కామసూత్రలో కొన్ని భంగిమలు క్లిష్టతరంతో కూడుకున్నవి. వాటిని వేయాలంటే కొంత సాధన అవసరం.