శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By ivr
Last Modified: మంగళవారం, 28 జులై 2015 (17:07 IST)

ఆ ఆంటీని చూస్తూ హెచ్.పి చేస్కుంటున్నా... మానుకోవడం ఎలా?

మా ఎదురింట్లో అందమైన ఆంటీ ఉంది. ఆమె చాలా అందంగా ఉంటారు. కానీ ఆమెను చూస్తుంటే నాలో సెక్స్ కోర్కెలు విపరీతంగా కలుగుతున్నాయి. ఎంత కంట్రోల్ చేసుకుందామని అనుకుంటున్నా వల్లకావడం లేదు. నిగ్రహించుకోలేకపోతున్నాను. దీంతో హెచ్.పి(హస్తప్రయోగం) చేస్కుంటున్నాను. ఇలా చేసుకుంటే అంగం క్షీణించిపోతుందని నా స్నేహితుడు అంటున్నాడు. ఈ హస్త ప్రయోగం అలవాటును మానుకోలేకపోతున్నాను. దీనికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాను. కంట్రోల్ చేయడం ఎలా...?
 
ఈ చర్య ఒక మనోలైంగిక వ్యాధిగా పేర్కొంటున్నారు. లైంగిక అవయవాలను ఇతరులకు చూపించడం, వారిని చూస్తూ హస్త ప్రయోగం చేసుకోవడం అనేది ఎక్జిబిషనిజమ్ అనే డెవియేటెడ్ సెక్స్‌కి సంబంధించిందని చెపుతున్నారు. 
 
ఆత్మనూన్యతకు లోనైన వారు, ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారు, బాల్యంలో లైంగిక అత్యాచారాలకు గురైన వారు, అణచుకోలేని తీవ్ర లైంగికవాంఛ ఉన్నవారు, వికృత లైంగిక చర్యలతో ఎదుటివారి దృష్టిని ఆకర్షించేందుకు చేసే చర్యలే ఇవి అని చెపుతున్నారు. దీనివల్ల వారు ప్రత్యక్షంగా శృంగారంలో పాల్గొన్న దానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
అయితే, ఇది కేవలం మనోలైంగిక వ్యాధి మాత్రమే కాదనీ, మన వ్యవస్థలో ఉన్న అనేక అపసవ్యతల నుంచి, స్త్రీలపట్ల ఉండే చులకన పురుషులకు, వారొక లైంగిక వస్తువులన్న భావజాలం నుంచి ఉద్భవించిన తీవ్రమైన సామాజిక సమస్యగా పేర్కొంటున్నారు. కనుక ఎదురింటి ఆంటీని చూస్తూ అతిగా హస్త ప్రయోగం చేస్కుంటూ సమయాన్ని వృధా చేయకుండా చదువు, కెరీర్... తదితర అంశాలపైన దృష్టి కేంద్రీకరించండి. అలా చేస్తే మీలో ఉన్న ఆ అలవాటు క్రమంగా పోయి తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తారు.